ఊహించని కమ్ బ్యాక్‌తో వస్తాం.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

రాబోయే ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన విజయసాయి రెడ్డి 2027 చివరిలో జమిలి ఎన్నికలు జరుగుతాయన్నారు.

Home Minister Anita : విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన హోంమంత్రి అనిత
New Update

రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎవరూ ఊహించని విధంగా కమ్ బ్యాక్ ఇస్తామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన విజయసాయి రెడ్డి వచ్చే ఎన్నికల గురించి మాట్లాడారు.

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

వచ్చే ఎన్నికల్లో ఊహించని విధంగా విజయం..

2027 చివరిలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఊహించని విజయం సాధిస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కేడర్ సమాయత్తం కావాలని తెలిపారు. 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఇలా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 14 స్థానాలకు మొత్తం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. 

ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

ఇదిలా ఉంటే దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కి కొందరు వ్యతిరేకత చూపిస్తున్నారు. ఈ నిర్ణయం సరైనది కాదని తెలుపుతున్నారు. ఈ జమిలి ఎన్నికల కోసం ఇప్పటికే ఒక కమిటీని కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు.  

ఇది కూడా చూడండి:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

ఇదంతా పక్కన పెడితే ఇటీవల సజ్జల రామకృష్ణా రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదని, అరాచకాలే ఉన్నాయన్నారు. కారణం లేకుండానే వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని, సూపర్ సిక్స్‌ పేరుతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. సీఎం చంద్రబాబు కావాలనే తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. 

ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

 

#vijaysai-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe