AP: విడదల రజనిపై అసభ్యకర పోస్టులు.. లోకేష్, పవన్ పై అంబటి ఆరోపణలు!

వైసీపీ సోషల్ మీడియా టీమ్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు అంబటి రాంబాబు. లోకేష్, పవన్ పోలీసులను ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. విడుదల రజనిపై పెట్టిన అసభ్యకర పోస్టులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

New Update
ssewe

AP News: వైసీపీ నాయకురాలు విడుదల రజనిపై అసభ్యకర పోస్టులు పెట్టడంపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మహిళా నాయకురాలిపై టీడీపీ నాయకులే దారుణంగా పోస్టులు పెట్టారని ఆరోపించారు. అంతేకాదు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.  పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తే ఇబ్బంది పడతారని, డీజీపీ పొలిటికల్ విమర్శలు మానుకోవాలన్నారు. డీజీపీకి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయిందంటూ సంచలన కామెంట్స్ చేశారు. 

వారిని అరెస్ట్ చేయడం దురదృష్టకరం.. 

ఈ మేరకు వైసీపీ లీగల్ ప్రతినిధులతో నగరంపాలెం, అరండల్ పేట పోలీస్ స్టేషన్లకి వెళ్లిన అంబటి రాంబాబు.. టీడీపీ అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు పోలీసులు అరెస్ట్ చేసిన ఇంటూరి రవి కిరణ్ , మేకా వెంకటరామిరెడ్డిని పరామర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వంలో పోస్టులు పెట్టారని ఇప్పుడు రవికిరణ్ ని, వెంకటరామిరెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. సోషల్ మీడియా కేసుల్లో 41 నోటీస్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని, అయినప్పటికీ తెలుగుదేశం నాయకులు వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. 

లోకేష్, పవన్ కళ్యాణ్ పోలీసులపైన ఒత్తిడి..

వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై లోకేష్, పవన్ కళ్యాణ్ పోలీసులపైన ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టిస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు భయపడరు. పథకాలు ఎందుకు అమలు చేయలేదని సోషల్ మీడియాలో అడిగినా కూడా కేసులు పెడుతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు