TTD:తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. వర్షాల నేపథ్యంలో దర్శనాలు రద్దు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తిరుమల వెళ్లే భక్తుల మీద కూడా పడింది.భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 15న సిఫారసులేఖలు, 6న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. By Bhavana 15 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి TTD: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తిరుమల వెళ్లే భక్తుల మీద కూడా పడింది. రానున్న మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనపడుతున్నాయి. దీని ప్రభావం తిరుమల వెళ్లే భక్తుల మీద కూడా పడే అవకాశాలుండడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. Also Read: గూగుల్ మ్యాప్‌నే తలదన్నే.. కొత్త యాప్ మీకు తెలుసా? వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నం సిబ్బందితో సమావేశమైన టీటీడీ ఈవో రాగల 36 గంటల్లో కురిసే వర్షాలపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యలు గురించి సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 15న సిఫార్సు లేఖలు అనుమతించడం లేదని టీటీడీ ఓ ప్రకటనలో ప్రకటించింది. 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల భద్రత ను దృష్టిలో పెట్టుకుని బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్యామలరావు ప్రకటించారు. pic.twitter.com/y6uGteP29G — Tirupati Tirumala Info (@tirupati_info) October 14, 2024 అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో కుండపోతగా వానలు పడుతున్నాయి. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. తుమ్మల పంట సముద్రతీరంలో 20 మీటర్ల వరకు అలలు ఎగిసిపడుతున్నట్లు అధికారులు తెలిపారు. Also Read: టీచర్ నియామకాల్లో బయటపడ్డ ఫేక్ సర్టిఫికేట్లు.. వారికి షాక్! మత్స్యకారులు వేటకు... మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే వెళ్లిన వారు ఉంటే తిరిగి రావాలని సూచించారు. అప్రమత్తమైన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అధికారులు కంట్రోల్‌రూమ్స్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. Also Read: రూ.9 కే బీమా.. దీపావళి వేళ ఫోన్‌పే అదిరిపోయే శుభవార్త! వీఐపీ బ్రేక్ దర్శనం, సిఫార్సు లేఖల రద్దుపై నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు భారీవర్షాలు కురిస్తే కొండ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో సిబ్బందికి ఈవో పలు సూచనలు ఇచ్చారు. అలాగే ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత విభాగాలు అలెర్ట్‌గా ఉండాలని తెలిపారు. Also Read: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. మరో రెండు రోజులు సెలవులు! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి