అందుకే తప్పుడు కేసులు పెడుతున్నారు.!
టిడిపి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫైర్ అయ్యారు టిడిపి జనసేన నేతలు. ఓటమి భయంతోనే వైసీపీ దొంగ ఓట్లను చేస్తోందని దుయ్యబట్టారు.
టిడిపి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫైర్ అయ్యారు టిడిపి జనసేన నేతలు. ఓటమి భయంతోనే వైసీపీ దొంగ ఓట్లను చేస్తోందని దుయ్యబట్టారు.
మంత్రి రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ఓ ప్రేమ జంట ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులు తమకు రక్షణ కల్పించకుండా మంత్రి రోజా ఒత్తిడి చేస్తున్నారని యువతి చెబుతోంది. డీజీపీ స్పందించి తమకు రక్షణ కల్పించాలంటూ విజ్ఞప్తి చేస్తోంది.
పుంగనూరు నియోజకవర్గంలో జనసేన, టీడీపీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పసుపులేటి హరిప్రసాద్, చల్లా రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
వైసిపి ఎమ్మెల్యే మదుసూదన్ పై నిప్పులు చెరిగారు శ్రీకాళహస్తి టిడిపి ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే భారీ ఎత్తున భూకబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. అధికారులకు సైతం ఇందులో వాటాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాయకరావుపేటలో టీడీపీ జనసేన తొలి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీని టార్గెట్ చేసిన ఈ రెండు పార్టీలు..వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్తులో ఉమ్మడిగా చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు.
తిరుమల తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేగింది. ఈ క్రమంలో టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులను నడక దారిలో గుంపులు గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపింది.
ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు ఏమి చేశామో చెప్పే దమ్ము ధైర్యం ను సీఎం జగన్ కల్పించారని ధీమ వ్యక్తం చేశారు మంత్రి రోజా. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. టీడీపీ హాయంలో ప్రజలకు అందలేని సంక్షేమ పథకాలన్నీ వైసీపీ పరిపాలనలో అందుతున్నాయన్నారు.
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలను తీసుకుంది. టీటీడీలో ప్రతి ఉద్యోగికి ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు..కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో అర్హత ఉన్నవారిని రెగ్యూలరైజ్ చేస్తున్నట్లు సమావేశంలో నిర్ణయించినట్లు చైర్మన్ భూమన తెలిపారు.