Bhumana Karunakar Reddy:
భక్త ద్రోహం చేయాలని టీడీపీ చూసింది. దానికి సుప్రీంకోర్టు బాగా బుద్ధి చెప్పింది అని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. అబద్ధాన్ని నిజం చేయాలని టీడీపీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. మహా ప్రసాదం కు మలినం అంటగట్టాలని చూశారు. సుప్రీం కోర్టు బాగా చివాట్లు వేసింది. కోర్టు స్పందించిన తీరు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని అన్నారు భూమన. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా హిందుత్వ సంఘాలు ఆందోళనకు గురయ్యాయి.
సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు శ్రీవారి ప్రసాదం పై బాధించింది. అసలు ఈవో చెప్పిన మాటలకు భిన్నంగా మాట్లాడుతూ.. సరైన ఆధారాలు లేకుండా జంతువులు కొవ్వు వాడారు అని ఎలా చెబుతారు అని భూమన ప్రశ్నించారు.తప్పు జరిగింది అంటూ ఎల్లో మీడియా విష ప్రచారం చేశారు .మహా ప్రసాదం, మహా మాలిన్యం అయింది అంటూ ప్రచారం చేశారు.స్వామి ప్రతిష్ఠ కు భంగం వాటిల్లే విధంగా లడ్డు ప్రసాదం విషయంలో అసత్యాలు ప్రచారం చేశారని భూమన మండిపడ్డారు.
దేవుడ్ని వివాదాల్లో తీసుకుని రాకండని ఎంత చెప్పినా వినలేదని భూమన కరుణాకర రెడ్డి అన్నారు. కేసు పెట్టకుండా, విచారణ జరపకుండా చంద్రబాబు మాట్లాడాడు. నాటుసారా తాగిన వ్యక్తి మాట్లాడినట్లూ సిఎంగా హోదాలో ఉంటూ అసత్యాలు మాట్లాడారని విమర్శించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సరైన విధంగా ప్రశ్నించింది.. దేవుడే సుప్రీంకోర్టుతో ఈ మాటలు పలికించాడు భూమన చెపుకొచ్చారు. నిజం ఎప్పటికి గెలుస్తుంది.. తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా మేము విచారణ కోరాము అని అన్నారు. స్వామీవారి వైభవాన్ని తగ్గించే విధంగా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారు. వీరిని హిందువులందరూ ఇప్పుడు ఛీ కొడుతున్నారంటూ తీవ్రంగా విమర్శించారు భూమన.