టీటీడీ భక్తులకు అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు కుదింపు

సామాన్య భక్తులకు వేసవిలో ఇబ్బంది ఉండకూడదని టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్రేక్‌ దర్శనాలను కుదించేందుకు ప్లాన్ చేస్తోంది. బ్రేక్‌ దర్శనం సమయాన్ని తగ్గించడం లేదా రద్దు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఇదే జరిగితే సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండదు.

New Update
Tirumala

Tirumala

వేసవి సెలవుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రేక్‌ దర్శనాలను కుదించేందుకు టీటీడీ ప్లాన్ చేస్తోంది. ఏపీతో పాటు ఇటీవల తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపైనా కూడా టీటీడీ వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు కేటాయిస్తుంది. శుక్ర, శనివారాల మినహా మిగిలిన అన్ని రోజులకు కూడా టీటీడీ ప్రస్తుతం వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను జారీ చేస్తుంది.

ఇది కూడా చూడండి: CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్

మధ్యాహ్నం వరకు బ్రేక్ దర్శనాలు..

దీంతో పాటు సీఎంవోలు, కేంద్రమంత్రులు, టీటీడీ బోర్డు, శ్రీవాణిట్రస్టు, న్యాయశాఖ, పోలీసు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ప్రెస్‌, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ఇలా వివిధ విభాగాలు, అధికారుల సిఫార్సులపై, స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ ప్రముఖులకు బ్రేక్‌ దర్శనాలు ఇస్తున్నాయి. ఉదయం స్టార్ట్ అయిన ఈ బ్రేక్ దర్శనాలు మధ్యాహ్నం వరకు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చూడండి:  Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

కొంతమంది టీటీడీపై ఒత్తిడి చేసి అదనపు కోటాలో కూడా టికెట్లు పొందుతున్నారు. ఇదే పరిస్థితి వేసవిలోనూ కొనసాగితే సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉందని భావించి.. బ్రేక్‌ దర్శనాల కుదింపుపై టీటీడీ ప్లాన్ చేస్తోంది. రానున్న పది రోజుల్లో బ్రేక్‌ దర్శనం సమయాన్ని తగ్గించే అంశంపై ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు.

ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

వేసవి సెలవుల్లో ప్రతి రోజు సర్వదర్శనం క్యూ లైన్‌ వెలుపలే ఉండే క్రమంలో సిఫార్సుపై లేఖలపై ఇచ్చే బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయనున్నారు. కేవలం ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేసేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు