Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ముగ్గురు సభ్యులతో కమిటీ

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆలయంలో తొక్కిసలాటకు దారి తీసిన అంశాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు.

New Update
Srikakulam Kasibugga Venkateswara  swamy temple

Srikakulam Kasibugga Venkateswara swamy temple

Kasibugga Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆలయంలో తొక్కిసలాటకు దారి తీసిన అంశాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే విచారణ ప్రారంభించిన ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కమిటీలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, శ్రీకాకుళం ASP కేవీ రమణ, దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ ప్రసాద్‌ ఉన్నారు. తొక్కిసలాటకు గల కారణాలను పరిశీలించి పూర్తి నివేదికను ఈ కమిటీ  ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Also Read: Allu Engagement: అబ్బా.. రామ్ చరణ్- బన్నీ ఏమున్నారు .. శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకలో మెగా- అల్లు ఫ్యామిలీ సందడి!

ఇలా ఉండగా, కార్తీక ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం విదితమే. 9 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఈ ప్రమాదంలో చనిపోయారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కాగా మృతులకు రాష్ర్ట కేంద్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్‌లోని స్వామివారి దర్శనం కోసం మెట్లు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే ప్రతివారం కేవలం రెండు నుంచి మూడు వేలమంది మాత్రమే వచ్చే ఈ ఆలయానికి ఏకాదశి సందర్భంగా సుమారు 25 వేలమంది వచ్చారని అంచనా వేశారు. అనుకోని విధంగా భక్తులు రావడంతో దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయలేదని తెలుస్తోంది.

ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో మెట్ల దగ్గర ఉన్న రెయిలింగ్ ఊడిపడింది. ఈ క్రమంలో భక్తులు ఒకరిపై ఒకరు పడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సానుభూతి తెలపడంతో పాటు నష్టపరిహారం ప్రకటించారు.

ఆలయంలో గాయపడిన వారికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.గాయపడిన వారికి ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అయితే అనుకోని విధంగా పెద్ద ఎత్తున భక్తులు రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇంత జనం వస్తారని ఊహించలేదని ఆలయం నిర్వహాకులు అంటున్నారు. గతంలో కేవలం రెండు నుంచి మూడు వేలమంది మాత్రమే దర్శనానికి వచ్చేవారని అలాంటి ఈసారి ఆ సంఖ్య ఎక్కువ అవడమే ఈ ప్రమాదానికి కారణమని ఆలయ ధర్మకర్త అంటున్నారు. ఇందులో తమ పొరపాటు ఏ మాత్రం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read: Dadasaheb Phalke Awards 2025: ప్రభాస్ 'కల్కి' చిత్రానికి మరో అరుదైన గౌరవం! అవార్డుల ఫుల్ లిస్ట్ ఇదే

Advertisment
తాజా కథనాలు