son kills mother : విశాఖలో దారుణం.. ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు.. కన్నతల్లిని కడతేర్చిన తనయుడు

విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఆన్ లైన్ గేములకు బానిసైన కొడుకును మందలించడమే ఆ తల్లి చేసిన పాపమైంది. కొడుకును మార్చడానికిఆ తల్లి చేసిన ప్రయత్నం ఫలించకపోగా కొడుకు చేతిలో ప్రాణాలు పోయాయి. కొడుకు చేతిలో హత్యకు గురైంది.

New Update
son kills mother

son kills mother

 The son killed his mother :  ఆన్ లైన్ గేములకు బానిసైన కొడుకును మందలించడమే ఆ తల్లి చేసిన పాపమైంది. ఆన్ లైన్ గేములకు బానిసైన కొడుకును మార్కుకునేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం ఫలించకపోగా కొడుకు చేతిలో ప్రాణాలు పోయాయి. 

విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఆన్ లైన్ గేములు ఆడద్దు అన్నందుకు కోపంతో తల్లిని కొడుకు దారుణంగా హత్య చేశాడు. ఆన్ లైన్ గేములకు బానిసైన కొడుకును ఆ తల్లి మందలించింది. దీంతో కోపంతో తల్లిని ఇష్టమొచ్చినట్లు కొట్టి చంపాడు ఆ ప్రబుద్ధుడు. కాగా మృతురాలి భర్త కోస్ట్ గార్డ్ కమాండెంట్‌గా పనిచేస్తున్న బల్బీర్ సింగ్ కాగా ఆయన భార్య మృతురాలు ఆల్కాసింగ్‌గా గుర్తించారు. కాగా ఆమె కుమారుడు అన్‌మోల్‌ సింగ్‌ గత కొన్నాళ్లుగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ కు అలవాటు పడినట్లు తెలిసింది. దీంతో ఆల్కాసింగ్‌ మందలించింది. ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడవద్దంటూ వారించింది.

Also Read: TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే!


కొడుకు విపరీతంగా ఆన్‌లైన్ గేమ్స్ బానిసకావడంతో.. వద్దని తల్లి మందలించిది. మొబైల్, ల్యాప్‌టాప్ లాక్కుంది. దీంతో కోపంతో రగిలిపోయిన కుమారుడు.. పక్కనే ఉన్న కత్తి తీసి తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. కొడుకు దాడిలో తల్లి అల్కా సింగ్ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో భయపడి అక్కడ నుంచి పారిపోయాడు కొడుకు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
 

Also Read: NAGOBA JATARA : నాగోబా జాతరలో నేడు కీలక ఘట్టం... దర్బార్ కు నేటికి ఎన్నేండ్లంటే...?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు