/rtv/media/media_files/2025/08/06/sathish-reddy-in-pulivendula-2025-08-06-20-02-55.jpeg)
కడప జిల్లా పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. YCP నాయకులపై దాడికి నిరసనగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డి DSPకి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో DSPతో YCP నేత సతీష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.
దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు పోలీస్ డీఎస్పీ ఆఫీస్ ముందు దర్నాకు దిగారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. YCP నాయకులు భారీగా రావడంతో DSP ఆఫీస్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల కారణంగా వివాదాలు చెలరేగుతున్నాయి. ఆగస్ట్ 12న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతలు స్థానికంగా ముమ్మరంగా పర్యటిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాముపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ రమేష్, వేముల రాము వాహనాన్ని కారుతో ఢీకొట్టి, టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వి దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. దాడిలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. కడప జిల్లా నల్లగొండువారిపల్లెలో ఈ ఘటన జరిగింది. టీడీపీ కార్యకర్తల దాడిలో వేముల రాము తీవ్రంగా గాయపడ్డారు. దీంతో.. పోలీసులే ఆయనను చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డి డీఎస్పీ ఆఫీస్‌కు వెళ్లారు.
పులివెందుల సహజంగా సమస్యాత్మక ప్రాంతమని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. కక్షలు రాజకీయ హత్యలు అనాదిగా జరుగుతున్న విషయం.. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు జోన్లుగా చేసి వాళ్లకు తగిన సూచనలు చేశామన్నారు. ఒక పార్టీ ప్రచారం చేస్తున్న సందర్భంలో ఇంకో పార్టీ అక్కడ వెళ్లకూడదని స్పష్టంగా చెప్పామన్నారు. కానీ బుధవారం నల్లగుండు వారి పల్లిలో పోలీసులు అనుమతించిన గ్రామానికి కాకుండా వైసీపీ నేతలు వేరే గ్రామంలో ప్రచారానికి వెళ్లారు. ఇటీవల టీడీపీలో చేరిన నాగేంద్ర రెడ్డి ఇంటికి వెళ్ళి వైసీపీ నేత రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వెళ్లారు. నాగేంద్ర రెడ్డిని బెదిరిస్తే కార్యకర్తలు ఆవేశం గురై ఈ దాడి చేశారని టిడిపి నేతలు చెబుతున్నారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు సేకరించాల్సి ఉందని డీఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు.