Ambedkar Konaseema: విద్య నేర్పాల్సిన గురువు విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించాడు. పిల్లలను కూలీలుగా మార్చడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఓ ఉపాధ్యాయుడు కూలి పని చేయించాడు. ఒక సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీ హల్ భవనంపై ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేయించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు స్కూల్‌కి వెళ్లి బాగా చదువు కోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు..కష్టపడి పిల్లలను చదివిస్తుంటారు.
గతంలో కొబ్బరిచెట్లు ఎక్కించిన ఘటనలు:
ఇది కూడా చదవండి: అందమైన అమ్మాయిలు ఉండే దేశాలు ఇవే
కానీ దీనికి విరుద్ధంగా ఎన్.కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థుల చేత కూలీ పనులు చేయిస్తున్న పరిస్థితి. విద్యార్థుల చేతతో పెన్ను పట్టించాల్సిన ఉపాధ్యాయుడు ఇలా పార పట్టించి పనులు చేయించడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో ఇదే స్కూల్‌లో ఉపాధ్యాయులు విద్యార్థులతో కొబ్బరిచెట్లు ఎక్కించిన ఘటనలు ఉన్నాయి. ఎక్కడైనా పరిశుభ్రత కోసం స్కూల్‌లో విద్యార్థుల చేత శుభ్రం చేయించడం చూశాం కానీ ఇక్కడ ఉపాధ్యాయులు స్కూల్ పక్కన ఉన్న ఒక సామాజిక చెందిన కమ్యూనిటీ హాల్ భవనంలో పార పట్టించి కూలి పని చేయించడం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: చనిపోయే ముందు మాట్లాడే మూడు మాటలు
ఇది కూడా చదవండి: గుర్రం కంటే పాము వేగంగా వెళ్లగలదా..?
ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో ఉద్యోగం వస్తే మీ లైఫ్ సెట్