భూమన ఓ నాస్తికుడు.. సంచలన ఫొటోలు బయటపెట్టిన TDP!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఓ నాస్తికుడని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అప్పట్లోనే రాడికల్ సంస్థ పెట్టి, విప్లవ సంస్థలో పని చేశాడని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేసింది.

New Update
Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

భూమన కరుణాకర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నాటకాలు వేస్తున్న కరుణాకరుడు ఎవరో గుర్తు పట్టారా? అంటూ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అప్పట్లోనే రాడికల్ సంస్థ పెట్టి, విప్లవ సంస్థలో పని చేశాడని ఆరోపించింది. నాస్తికత్వం ప్రమోట్ చేస్తూ, హిందూ దేవుళ్ళని అవమానించేలా తప్పుడు ప్రచారం చేస్తూ నాటకాలు వేసే వాడని పేర్కొంది. ఇప్పటికీ అదే విధంగా, హిందూ దేవుళ్ళని అవమానిస్తూ నాటకాలు వేస్తున్నాడంటూ ధ్వజమెత్తింది. అంతా కరుణాకర జగన్ మాయ అంటూ సెటైర్లు వేసింది. టీడీపీ చేసిన ఆరోపణలపై భూమన కరుణాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

 

(bhumana-karunakar-reddy | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు