/rtv/media/media_files/WPr5txFkWyxdklUVpERn.jpg)
Jagan Tirupati Tour: తిరుపతిలో మాజీ సీఎం జగన్ పై దాడికి కుట్ర జరుగుతోందని వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. శ్రీవారి దర్శనార్థం ఈరోజు సాయంత్రం తిరుమలకి వైయస్ జగన్ చేరుకోనున్నారు. ఈ క్రమంలో తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైయస్ జగన్ పై దాడికి భానుప్రకాశ్ రెడ్డి, కిరణ్ రాయల్, టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు తమకు సమాచారం అందినట్లు పేర్కొంది. వైయస్ జగన్ వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలిసినట్లు పేర్కొంది.
తిరుపతిలో మాజీ సీఎం @ysjagan గారిపై దాడికి కుట్ర!
— YSR Congress Party (@YSRCParty) September 27, 2024
శ్రీవారి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం తిరుమలకి చేరుకోనున్న వైయస్ జగన్ గారు
తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైయస్ జగన్ గారిపై దాడికి భానుప్రకాశ్ రెడ్డి (@BJP4Andhra), కిరణ్ రాయల్ (@JanaSenaParty), @JaiTDP…