/rtv/media/media_files/2025/05/25/uhGQJklmsFGnqLgKxyVh.jpg)
విజయనగరం ఐఎస్ఐఎస్ ఉగ్రమూలాల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు రోజులుగా నిందితులు సిరాజ్, సమీర్‌లను పోలీసులు విచారిస్తున్నారు. విజయనగరం పోలీసు ట్రెయినింగ్ అకాడమీలో శనివారం 7 గంటల పాటు విచారణ జరిగింది. అయితే ఈ విచారణలో సిరాజ్‌కు ఒక అజ్ఞాత వ్యక్తి ప్రోత్సాహం అందించినట్లుగా తేలింది. అలాగే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సిరాజ్ చేసిన కామెంట్స్ కు ఆ వ్యక్తి స్పందించి ప్రశంసించాడు. దీంతో ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సిరాజ్ సోషల్ మీడియాలో స్పందించాడు.
దీనిని ఒక అజ్ఞాత వ్యక్తి గుర్తించాడు. ముందుగా సిరాజ్‌ను మెచ్చుకుంటూ అతడికి మెసేజ్ వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. కొంతకాలానికి ఆ వ్యక్తి తన వివరాలను సిరాజ్‌కు చెప్పాడు. తాను విశాఖకు చెందిన రెవెన్యూ అధికారినని పరిచయం చేసుకున్నాడు. ఒక వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్‌ను ప్రోత్సహించాడు. అధికారి పాత్ర గురించి సిరాజ్ చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ అధికారి సిరాజ్‌ను ఎందుకు ప్రోత్సహించాడు? అతడి వెనుకున్న ఉద్దేశం ఏమిటి? అనే విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తనను ప్రశంసిస్తూ అతడి నుంచి మెసేజ్ వచ్చిందని సిరాజ్ పేర్కొన్నాడు. స్వయంగా అతడు ఫోన్ చేసి అభినందించినట్టుగా కూడా తెలిపాడు.
మొత్తం ఆరుగురిని ఆదుపులోకి
ఇక ఈ కేసులో మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో త్వరలోనే బయటపడనున్నాయి. కాగా ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు ఆదుపులోకి తీసుకుని వాచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు సిరాజ్, సమీర్‌లు మరో నలుగురితో కలిసి సోషల్ మీడియాలో ఒక సిక్రెట్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని చాటింగ్ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా సిరాజ్, సమీర్ లు ఇద్దరు కలిసి.. అల్‌హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను స్థాపించినట్టుగా విచారణలో బయటపడింది. ఈ ఆరుగురు యువకులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యువకులుగా పోలీసులు తేల్చారు. వీరిని అరెస్ట్ సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభ్యమైనట్లుగా పోలీసులు వెల్లడించారు.