AP: టీడీపీ కొత్త మద్యం పాలసీ.. బెవరేజస్ స్టాఫ్ ఆందోళన..!
ఏపీలో టీడీపీ ప్రవేశ పెట్టనున్న కొత్త మద్యం పాలసీపై శ్రీకాకుళంలో బెవరేజస్ స్టాఫ్ ఆందోళన చేపట్టారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించి, తమను, తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏపీలో టీడీపీ ప్రవేశ పెట్టనున్న కొత్త మద్యం పాలసీపై శ్రీకాకుళంలో బెవరేజస్ స్టాఫ్ ఆందోళన చేపట్టారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించి, తమను, తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
AP: వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదని అధికారులకు ఆదేశించారు. రైతులకు ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని అన్నారు.
చంద్రబాబు కేబినెట్లో కీలకమైన ఆర్థిక, హోం, విద్యా, రెవెన్యూ, ఐటీ శాఖలు టీడీపీ మంత్రులకే దక్కాయి. జనసేనకు ఇచ్చిన శాఖల్లో కీలకంగా పంచాయతీరాజ్ శాఖ నిలిచింది. కాగా టాప్ ఐదు మంత్రులుగా పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, లోకేష్, నిమ్మల రామానాయుడు ఉండనున్నారు.
దేశ విమానయాన రంగాన్ని ప్రపంచంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తమ శాఖకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నట్లు చెప్పారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 2024లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఏపీలో విమాన సర్వీసులు, కనెక్టివిటీ పెంపెందించడానికి కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాన్య ప్రజలు అనువైన ధరలో విమానంలో ప్రయాణించేలా చేస్తామన్నారు. కేంద్రం సహకారంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.
మోదీ కేబినెట్ లో ఈసారి కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన వారిలో అత్యంత చిన్న వయసున్న వ్యక్తి ఏపీకి చెందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు కాగా, హెచ్ఏఎం నేత జీతన్ రాం మాంఝీ అత్యంత వృద్దునిగా ఉన్నారు.
ప్రజలకు మంచి చేసినా తమని అంత ఘోరంగా ఎందుకు ఓడించారో అర్థం కావడంలేదన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. వైసీపీ తిరిగి పుంజుకుంటుందని అన్నారు. కొత్త ప్రభుత్వం వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తుంటే గవర్నర్ సైలెంట్ గా ఉండటం సరికాదన్నారు.
శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ రోజు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాతికేళ్ల వయస్సులోనే ఎంపీగా విజయం సాధించిన రామ్మోహన్ నాయుడు.. 36 ఏళ్లకే కేంద్ర మంత్రి పదవిని చేపట్టనున్నారు. అమెరికాలో ఇంజనీరింగ్ తో పాటు ఎంబీఏ పట్టాను అందుకున్నారు.