Jagan: జగన్ కు బిగ్ షాక్.. సోలార్ పవర్ కేసులో పీసీ యాక్ట్? సోలార్ పవర్ ప్రాజెక్టు కుంభంకోణం కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ కు మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. 2021లో 7 వేల మెగావాట్లకోసం రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు అదానీ చార్జిషీటులో పేర్కొన్నారు. జగన్‌ను ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. By srinivas 24 Nov 2024 | నవీకరించబడింది పై 24 Nov 2024 10:35 IST in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Jagan: సోలార్ పవర్ ప్రాజెక్టు కుంభంకోణం కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ కు మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. 2021లో 7 వేల మెగావాట్లకోసం రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు అదానీ చార్జిషీటులో పేర్కొన్నారు. జగన్‌ను ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి ఉన్నట్లు చార్జిషీటు.. ఈ మేరకు సోలార్ పవర్ కొనుగోలు ఒప్పందం కేసులో అమెరికాలో గౌతమ్ అదానీ తదితరులపై కేసు నమోదు చేశారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అక్కడి కోర్టుల్లో అభియోగాలు నమోదు చేసింది. అయితే 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ చేసుకోవడానికి రూ.1750 కోట్ల లంచం ఇచ్చారని చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి ఉన్నట్లు చార్జిషీటులో ప్రస్తావించారు. దీంతో జగన్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని చంద్రబాబు సర్కార్ యోచిస్తోంది. ఇందుకోసం గవర్నర్ అనుమతిని కోరే అవకాశం కనిపిస్తోంది. అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ ఆర్టికల్ ప్రకారం జగన్ ను అరెస్ట్ చేసి విచారణ జరపాలని భావిస్తోంది. చేతులు మారిన వందల కోట్లు.. ఇక రాష్ట్రాన్ని లూఠీ చేసిన వాళ్ల విషయంలో సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని చంద్రబాబు భావిస్తున్నారు. వందల కోట్ల లంచాలు చేతులు మారాయని, అమెరికాలో కేసులు నమోదైన తర్వాత చూస్తూ ఎలా ఊరుకొంటామని, అందుకే న్యాయ సలహా తీసుకొంటామని చెబుతున్నారు. బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వసంత కృష్ణప్రసాద్.. జగన్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర పెద్దలతో మాట్లాడి వారి సూచనల మేరకు జగన్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. సమాచారం చంద్రబాబుకు చేరవేత.. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దీనిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారాలకు పాల్పడి, అస్తవ్యస్త విధానాలను సాగించడం వల్లనే ప్రజలపై విద్యుత్ భారం పడిందంటున్నారు. అగ్రిమెంట్ లో ఏముందో పూర్తిగా పరిశీలించి పూర్తి ఇన్ఫర్మేషన్ సీఎం చంద్రబాబుకు అందించనున్నారు రవికుమార్. అసలేం జరిగిందంటే.. భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపడం సంచలనంగా మారింది. ఓ భారీ కాంట్రాక్టు పొందేందుకు 265 మిలియన్ డాలర్ల (రూ.2,029 కోట్లు) లంచాలు ఇచ్చినట్లు కోర్టు పేర్కొంది. దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ అంశం ఇప్పుడు ఏపీని తాకడం మరింత సంచలనంగా మారింది. గత జగన్ సర్కార్ పేరు ఇందులో ప్రముఖంగా వినిపిస్తోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో జరిగిన ఒప్పందం స్కామ్‌లో జగన్ సర్కారుపై ఆరోపణలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు 228 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు రూ.1750 కోట్లు లంచాలను తీసుకున్నట్లు బ్రూక్లిన్ కోర్టు చేసిన ఆరోపణల్లో ఉంది. 2021లో గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా నాటి సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయినట్లు ఆ అభియోగాల్లో పేర్కొన్నారు. అప్పుడు విద్యుత్తు సరఫరా ఒప్పందంపై చర్చలు జరిగాయి. అదే సమయంలో 7,000 మెగావాట్ల కొనుగోలు డీల్ కుదరడానికి అదానీ ఇచ్చిన లంచాలే కారణమని అభియోగాల్లో పేర్కొన్నారు. 2019-24 మధ్య పనిచేసిన ఓ అత్యున్నత స్థాయి వ్యక్తి హస్తం ఉన్నట్లు ప్రస్తావించారు. ఈ ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లడానికి గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్‌లోని అధికారితో పలు సమావేశాల్లో వ్యక్తిగతంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈ సమావేశాలు 2021 ఆగస్టు 7, సెప్టెంబరు 12, నవంబర్ 20 తేదీల్లో జరిగినట్లు ఆరోపణల్లో పేర్కొన్నారు. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ లు డిసెంబర్ 1, 2021న SECI (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో 2.3 గిగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి అంగీకరించి PSA లోకి ప్రవేశించాయి. #jagan #america #adani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి