చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై బాబాయి అత్యాచారం!

కడప జిల్లా చక్రాయపేట మండలం అప్పిరెడ్డి గారిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి సొంత బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. నొప్పిగా ఉందని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Crime News : వీళ్ళసలు మనుషులేనా? చిన్నారిని చిదిమేసిన కన్నతండ్రి.. మేనమామ..అన్న! 

Crime

New Update

AP News: దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా కడప జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై సొంత బాబాయి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.

బాబాయ్ శివాజీ బెదిరించడంతో..

వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా చక్రాయపేట మండలం అప్పిరెడ్డి గారిపల్లిలో ఆరేళ్ల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో చాక్లెట్ చూపించి గుడిసెలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాబాయి శివాజీ బెదిరించడంతో భయపడి చిన్నారి తల్లిదండ్రులకు చెప్పలేదు. రెండు రోజుల తర్వాత మల ద్వారం దగ్గర నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయట పడింది.

అయితే ఇడుపులపాయలో కూలి పనులు చేసుకుంటూ చిన్నారి తల్లిదండ్రులు జీవనం సాగిస్తున్నారు.  కూతురిని మేనత్త ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు. మేనత్త ఆస్పత్రికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరని తెలుకున్న చిన్నాన్న శివాజీ అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

Also Read: శ్రీవారిమెట్టు దగ్గర చిరుత సంచారం.. భక్తుల్లో టెన్షన్

#ap-news #rape
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe