/rtv/media/media_files/2025/09/29/antarvedi-news-2025-09-29-21-06-23.jpg)
Antarvedi news
భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు లేదా సముద్ర గర్భంలో కొండచరియలు విరిగిపడటం వంటి కారణాల వల్ల సునామీలు సంభవిస్తాయి. ఇవి సముద్రంలో భారీగా తరంగాలను సృష్టిస్తాయి. తీర ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. సునామీ సంభవించే ముందు ప్రకృతి కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది. భూమి తీవ్రంగా మరియు చాలాసేపు కంపించడం, సముద్రపు నీరు అసాధారణంగా మరియు ఆకస్మికంగా వెనక్కి తగ్గిపోవడం, సముద్రం నుండి వింత, పెద్ద శబ్దాలు లేదా గర్జనలు వినిపించడం. ఈ సంకేతాలు కనిపించిన వెంటనే ప్రజలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలకు తరలిపోవడం చాలా అవసరం. అయితే తాజాగా బంగాళాఖాతంలో అసాధారణ పరిణామంలో మార్పు చోటు చేసుకుంది. అంతర్వేదిలో సముద్రం 500 మీటర్లు వెనక్కి తగ్గింది.
భారీ సునామీ భయం:
కోనసీమ జిల్లా అంతర్వేదిలో బంగాళాఖాతం అకస్మాత్తుగా 500 మీటర్లు (అర కిలోమీటరు) వెనక్కి తగ్గడం స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. సాధారణంగా ఇసుక దిబ్బలతో ఉండే సముద్రతీరం మొత్తం మోకాలి లోతు దళసరి ఒండ్రుమట్టితో నిండిపోవడం ఈ అసాధారణ దృశ్యానికి మరింత ఆందోళన కలిగిస్తోంది. గతంలో సముద్రం కొద్ది మీటర్లు వెనక్కి తగ్గిన సందర్భాలు ఉన్నాయని అప్పుడు ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. కానీ ఈసారి ఏకంగా అర కిలోమీటరు మేర సముద్రం వెనక్కి తగ్గడం, ఒండ్రుమట్టి పేరుకుపోవడం మాత్రం తామెప్పుడూ చూడలేదని గ్రామస్థులు, మత్స్యకారులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: అక్టోబర్ 1 లేదా 2.. నవరాత్రి ఉపవాసం ముగించడానికి సరైన రోజు ఏదో తెలుసా?
కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద ఊహించని ఘటన
— RTV (@RTVnewsnetwork) September 29, 2025
500 మీటర్ల మేర వెనక్కు వెళ్లిపోయిన బంగాళాఖాతం..
మోకాళ్ల లోతు వరకు ఒండ్రు మట్టితో నిండిన తీరప్రాంతం
సునామి వచ్చే సూచనలు ఉన్నప్పుడే సముద్రం ఇలా వెనక్కి వెళ్తుందంటూ ఆందోళన చెందుతున్న తీరప్రాంత ప్రజలు..#AndhraPradesh#konasemma… pic.twitter.com/ZLJwkqPYZT
పెద్దలు చెప్పిన కథనాల ప్రకారం.. సునామీలు వంటి ప్రకృతి విపత్తుల ముందు సముద్రం ఇలాగే వెనక్కి తగ్గుతుందని గుర్తు చేసుకుంటూ అంతర్వేది ప్రజలు భయపడుతున్నారు. ఈ వింత పరిణామం వెనుక కారణాలు తెలియక స్థానిక మత్స్యకారులు, ప్రజలు ఆందోళనతో అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. సముద్రంలో చోటుచేసుకున్న ఈ అనూహ్య మార్పుకు కారణాలను అన్వేషించి తమ భయాందోళనలు తొలగించాలని వారు కోరుతున్నారు. ఈ పరిణామంపై అధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ బతుకమ్మ వేడుకల్లో విషాదం.. షాక్‌తో స్పాట్లో ముగ్గురు..!