/rtv/media/media_files/2025/11/01/rare-honor-for-nara-bhuvaneshwari-international-awards-2025-11-01-08-58-02.jpg)
Rare honor for Nara Bhuvaneshwari.. International awards
Nara Bhuvaneshwari : ఏసీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. పారిశ్రామిక నాయకత్వం, ప్రజా సేవ , సామాజిక సాధికారత రంగాలలో ఆమె చేసిన విశేష కృషికి గాను, లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025' అవార్డుకు ఆమెను ఎంపిక చేసింది. ఏటా ఈ అవార్డులను ఐవోడీ ఎంపిక చేస్తుంది. కాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి భువనేశ్వరి శనివారం రాత్రి హైదరాబాద్ నుండి లండన్‌కు బయలుదేరనున్నారు. నవంబర్ 4వ తేదీన లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్ వేదికగా జరిగే కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు.
'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్' అవార్డును ఐఓడీ సంస్థ విశిష్ట వ్యక్తులకు మాత్రమే అందిస్తుంది. గతంలో ఈ గౌరవాన్ని పొందిన వారిలో దివంగత భారత మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో-చైర్మన్ గోపిచంద్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్‌పర్సన్ రాజశ్రీ బిర్లా వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఉన్నారు. ఇప్పుడు నారా భువనేశ్వరి వారి సరసన నిలవనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సాధికారతకు ఆమె చేస్తున్న కృషిని ఈ సంస్థ ప్రత్యేకంగా గుర్తించింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, ఎన్టీఆర్ విద్యార్థి సహాయ పథకాలు, విపత్తు నిర్వహణ సేవలు, మహిళల ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతున్నాయి. ప్రత్యేకించి తలసేమియా రోగులకు ఉచితంగా బ్లడ్ ట్రాన్స్‌ప్యూజన్స్ నిర్వహించడటంతో పాటు దీనిపై భువనేశ్వరి పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు.
వ్యక్తిగత అవార్డుతో పాటు, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో కూడా భువనేశ్వరి మరో ముఖ్యమైన అవార్డును అందుకోనున్నారు. ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్స్ విభాగంలో జాతీయ స్థాయిలో హెరిటేజ్ ఫుడ్స్‌కు లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును అదే వేదికపై ఆమె స్వీకరించనున్నారు. ఎఫ్‌ఎంసీజీ (FMCG) విభాగంలో కంపెనీ పాటించిన అత్యుత్తమ పాలనా ప్రమాణాలకు ఈ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార, సామాజిక, పరిపాలనా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. వాణిజ్య రంగంలో అందిస్తున్న సేవలకు గాను దేశంలోని అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో భువనేశ్వరి ఒకరని 2013లోనే ఫార్చూన్ ఇండియా పేర్కొంది.
లండన్‌లో చంద్రబాబు పారిశ్రామిక భేటీలు
కాగా అవార్డు కార్యక్రమానిక వ్యక్తిగత హోదాలో లండన్ వెళుతన్న చంద్రబాబు ఆ పర్యటన అనంతరం లండన్‌లో పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం లండన్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులను, అలాగే ప్రవాసాంధ్రులను ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు. ఈ పర్యటన ముగించుకొని నవంబర్ 6వ తేదీన సీఎం తిరిగి వస్తారు.
Also Red: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లీయర్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
Follow Us