Ram Mohan Naidu : కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడికి మరో కీలక పదవి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. By Bhavana 12 Sep 2024 | నవీకరించబడింది పై 12 Sep 2024 13:03 IST in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి Ram Mohan Naidu : కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడిని కీలక పదవి వరించింది. ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్‌గా ఆయన ఎన్నికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. దేశం తరఫున తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల రామ్మోహన్‌నాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశం తరఫున తనకు దక్కిన ఈ గౌరవాన్ని తాను మరింత బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడంతో పాటు సభ్యదేశాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. రామ్మోహన్ నాయుడు గత మూడు ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి కుటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అందులో టీడీపీ కీలకంగా మారడంతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అత్యంత ముఖ్యమైన పౌర విమానయాన శాఖను ప్రధాని మోదీ రామ్మోహన్ నాయుడికి అప్పగించారు. తాజాగా ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్‌గా ఆయన ఎన్నికయ్యారు. దీంతో ఆయన అనుచరులు, టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు బాబాయి అయిన అచ్చెన్నాయుడు ఏపీ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. Also Read : నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు #delhi #kinjarapu-ram-mohan-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి