/rtv/media/media_files/2025/10/24/bus-accident-2025-10-24-18-37-10.jpg)
రెండు తెలుగు రాష్ట్రాలను కన్నీరు పెట్టిస్తున్న కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ కావేరి బస్సు అగ్ని ప్రమాదానికి గురై 20 మంది సజీవదహనమైయ్యారు. బస్సులో మంటలు అంటుకోగానే డ్రైవర్, కో డ్రైవర్ ప్రయాణీకులను వదిలిస్తే అక్కడి నుంచి పారారైయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున 2.40 నిమిషాలకు బైక్‌ని ఢీకొట్టింది. దాన్ని నడిపిన వ్యక్తి బైక్‌తోపాటు బస్సు కింద పడిపోయాడు. బస్సు ఇంజిన్ ముందు బాగంలో ఇరుక్కిపోయిన బైక్‌ని కొద్ది దూరం అలాగే ఈడ్చుకేళ్లాడు డ్రైవర్. దీంతో బస్సు ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సంతా వ్యాపించాయి. ఈ క్రమంలో బస్సులోని డ్రైవర్, కోడ్రైవర్‌ను బస్సు దిగి పారిపోయారు.
కర్నూలు బస్సు ప్రమాదం ఘటనా స్థలిని అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రమాదం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నాను. మా ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు పరిహారం అందిస్తాం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు… pic.twitter.com/xLmCSBbKqC
— Jupally Krishna Rao (@jupallyk_rao) October 24, 2025
కనీసం బస్సు డోర్ తీయడానికి కూడా ట్రై చేయలేదు. పోలీసులు బస్సు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకొని విచారించారు. డ్రైవర్ చెప్పిన మాటలు విని పోలీసులు షాక్ అయ్యారు. బస్సు ప్రమాదం జరిగిన చోటుకు రాకముందుకే బైక్ యాక్సిడెంట్ జరిగిందని బస్సు నడిపిన వ్యక్తి చెబుతున్నారు. డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో బస్సు స్పాట్‌కి రాకముందే బైక్ ప్రమాదం జరిగిందన్న పోలీసులు నిర్థారించుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీ కొట్టడం వల్లే.. బస్సులో మంటలు చెలరేగినట్టు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల అదుపులో డ్రైవర్, కో-డ్రైవర్లు ఉన్నారు. ఈ కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. బైక్‌ను లాక్కెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ పోలీసులకు చెప్పాడు.
కర్నూల్ బస్సు ప్రమాద ఘటన AI వీడియో
— YK TV Network (@YKTvNetwork) October 24, 2025
Tragic Kurnool accident AI video
#Kurnool#AndhraPradesh#BusAccident#Bengaluru#Hyderabadpic.twitter.com/1tUo8hE7AH
Follow Us