AP News: విశాఖలో బెట్టింగ్ మాఫియా గుట్టురట్టయింది. ఒక బెట్టింగ్ యాప్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వందల సంఖ్యలో బ్యాంక్ డెబిట్ కార్డులు, చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ కేంద్రంగా సైబర్ క్రైమ్‌కి పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చైనా వాళ్లతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. రకరకాల పేర్లతో బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నట్టు గుర్తించామని విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతిలేకుండా బెట్టింగ్ యాప్ నడుపుతున్నారని, విశాఖ వన్‌టౌన్ ప్రాంతంలో ఒక వర్కింగ్ సెంటర్ పెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: చిప్స్ ప్యాకెట్స్‌లో ఏ గాలి నింపుతారో తెలుసా..?
డబ్బులు పంపడంపై ఆరా..
ఈ బెట్టింగ్ యాప్ ద్వారా సొమ్మును థైవాన్‌కి పంపుతున్నారని, ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని సీపీ చెప్పారు. అంతేకాకుండా నిందితుల నుంచి పది లాప్ ట్యాప్‌లు, 8 డెస్క్‌టాప్‌లు, కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని సీపీ శంకబ్రత బాగ్జీ అన్నారు. చైనా, థైవాన్‌కు డబ్బులు పంపడంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. 800 అకౌంట్లు, చెక్‌బుక్‌లతో పాటు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎలాంటి చిరునామాలు లేకుండా సిమ్‌కార్డులు వాడినట్టు గుర్తించారు. సిమ్‌కార్డులు ఎవరిచ్చారనేదానిపై విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో ఉద్యోగం వస్తే మీ లైఫ్ సెట్
ఇది కూడా చదవండి: అందమైన అమ్మాయిలు ఉండే దేశాలు ఇవే
ఇది కూడా చదవండి: గర్భిణులు ఉపవాసం చేస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి