తొమ్మిదో తరగతి బాలికతో ఎఫైర్.. ఉపాధ్యాయుడికి బతికినంతకాలం జైలు శిక్ష

పాఠశాల విద్యార్ధినిని అపహరించిన ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు షేక్‌ మహమ్మద్‌‌కు ఒంగోలు పోక్సో కోర్టు బతికినంత కాలం జైలు శిక్ష విధించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 2017లో మైనర్‌ బాలికను పాఠశాల ఉపాధ్యాయుడు అపహరించాడు.

Ongole POCSO court
New Update

విద్యార్థికి విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ప్రేమ పాఠాలు చెప్పాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. తనతో వచ్చేయాలని.. మంచి జీవితం అందిస్తానని నమ్మించాడు. అతడి మాటలు విన్న ఆ బాలిక ఇంట్లో నుంచి పారిపోయింది. కట్ చేస్తే.. ఆ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా.. బతికినంతకాలం జైలు శిక్ష విధిస్తూ.. ఒంగోలు పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి, ఏడో అదనపు జిల్లా జడ్జి టి.రాజావెంకటాద్రి సోమవారం తీర్పు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస

ఏం జరిగిందంటే?

ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ అఫ్సర్ బాషా అదే గ్రామంలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆ సమయంలోనే తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలికపై కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. జీవితాంతం సంతోషంగా చూసుకుంటానంటూ నమ్మించి వలలోకి దించాడు. 

Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!

అలా అతడి వలలో పడిపోయిన ఆ బాలికను ఇంటి నుంచి వచ్చేయాలని చాలా సార్లు రిక్వెస్ట్ చేశాడు. దీంతో 2017 ఆగస్టు 6న ఆ బాలిక ఇంటినుంచి అతడితో వెళ్లిపోయింది. ఆపై ఆమెకు జాబ్ కోసం పలు ప్రాంతాలు తిరిగాడు. వెళ్లిన ప్రతి చోట ఆమెను తన చెల్లిగానే పరిచయం చేశాడు. ఇదిలా కొనసాగుతుండగా.. ఆ బాలిక తల్లిదండ్రులు మరోవైపు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 

Also Read: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. వీరిద్దరూ నరసరావు పేటలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు అదే నెల 24వ తేదీన ఇద్దరినీ పట్టుకున్నారు. అనంతరం వారిని ఒంగోలుకు తీసుకొచ్చారు. అనంతరం నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయడంతో పాటు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. 

Also Read: ఏపీలో 280 పోస్టులకు నోటిఫికేషన్..

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి ఊహించని శిక్ష వేశారు. నేరారోపణలు రుజువు కావడంతో నిందితుడికి బతికినంత కాలం జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా రూ.25 వేల జరిమానా సైతం విధించారు. మరోవైపు పరిహార చట్టం కింద బాధితురాలికి ప్రభుత్వం నుంచి సుమారు రూ.7 లక్షల సాయం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు ఆదేశించారు.

#pocso #crime news telugu #ap-crime-news #ongole-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe