ఆ ముగ్గురిని ఆస్తి కోసమే చంపేశారు!
ఈ నెల 6 వ తేదీన జరిగిన మూడు హత్యల కేసులో నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ తెలిపారు. ఈ కేసు కు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియా ముందు వెల్లడించారు.
ఈ నెల 6 వ తేదీన జరిగిన మూడు హత్యల కేసులో నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ తెలిపారు. ఈ కేసు కు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియా ముందు వెల్లడించారు.
చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన ఫోరెన్సిక్ నిపుణులు. చిన్నారిని చిరుతే చంపినట్లు పేర్కొన్న నిపుణులు. లక్షిత పై దాడి చేసింది చిరుత పులే. చిన్నారి తండ్రి దినేష్ కుమార్ సైతం లక్షిత ను చిరుత పులి దాడి చేసినట్టుగా స్పష్టం చేశారు.
మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు ప్రియ విడుదల చేసిన వీడియోలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. నారాయణపై ఆమె ఫిర్యాదుచేయడం.. ఆమెకు పిచ్చి అంటూ భర్త సుబ్రహ్మణ్యం వీడియో రిలీజ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రెడీ అవుతోంది. రేపు ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ ప్రయోగంలో భాగంగా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-56 అంతరిక్షంలోకి పంపించనున్నారు. మొత్తం ఏడు పగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-56 అంతరిక్షంలోకి మోసుకు పోనుంది.
వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అక్కున చేర్చుకుంది. ఇప్పటికే ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరి చురుగ్గా పనిచేస్తున్నారు. తాజాగా శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని వెంటకగిరిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్ష నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాటంటీర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వాలంటీర్లను పవన్ అనుమానించడం బాధాకరమన్నారు.
నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి వైసీపీ షాక్ ఇచ్చింది. ఆయన సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇప్పటివరకు ఆనం జయకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాత్రం వైసీపీలో ఉన్నారు. ఆయన సతీమణి ఆనం ఆ రుణమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వైసీపీని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం వైపుకు వెళ్ళిపోయారు.
ఏపీలో అబద్దాల నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు మాత్రమే అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ అధినేతపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో.. దేశంలో ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అంటూ కాకాణి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇంత అబద్ధాల నాయకుని నేనెక్కడ చూడలేదు అంటూ మండిపడ్డారు.