పొలిటికల్ సెన్సేషనల్, సీఎం జగన్ని కలిసిన ఆనం సోదరులు
నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి వైసీపీ షాక్ ఇచ్చింది. ఆయన సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇప్పటివరకు ఆనం జయకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాత్రం వైసీపీలో ఉన్నారు. ఆయన సతీమణి ఆనం ఆ రుణమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వైసీపీని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం వైపుకు వెళ్ళిపోయారు.