Nellore: మా సమస్యలను తీర్చండి.. ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ఆందోళన..!
మా సమస్యలను తీర్చండి అంటూ నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత, నాన్ టీచింగ్ సిబ్బంది కొరత ఉందని వాపోతున్నారు.