/rtv/media/media_files/2025/10/25/nellore-2025-10-25-10-33-13.jpg)
కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరువకముందే ఏపీలో మరో దారుణం జరిగింది. ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నెల్లూరులో లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఐరన్ బారికేడ్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది. ఐరన్ బారికేడ్ లేకపోతే బస్సు పల్టీ కొట్టే ప్రమాదం ఉండేది.
బ్రేకింగ్..
— RTV (@RTVnewsnetwork) October 25, 2025
నెల్లూరు
తూటీలో తప్పిన బస్సు పరమాదం
నెల్లూరు జిల్లా కొత్తూరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ బస్సు లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఐరన్ బారికేడ్‌ను ఢీకొట్టింది. రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సులో 36 మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు… pic.twitter.com/tlaOFHhwhP
ఇద్దరు డ్రైవర్లతో పాటు 34మంది
ఈ ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 34మంది ప్రయాణికులన్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే బస్సులోని ప్రయాణికులను ఇతర వాహనాల్లో తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వరుసగా బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
అటు మరోవైపు కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపద్యంలో నెల్లూరు రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. RTO మదానీ ఆధ్వర్యంలో పూలే బొమ్మ సెంటర్లో ప్రైవేట్ ట్రావెల్స్ ను అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా లేదని రెండు బస్సులను సీజ్ చేశారు అధికారులు.
Follow Us