/rtv/media/media_files/2025/01/15/XZDCxt5U67h8zmc4u0ab.jpg)
Manchu Manoj Mohan Babu
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. మనోజ్ పై చంద్రగిరి పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. తమ అనుమతి లేకుండా విద్యాసంస్థల్లోని డైరీఫాంలోకి మంచు మనోజ్ చొరబడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గేటు దూకి లోపలికి వెళ్లి కోర్టు ఆదేశాలను ధిక్కరించాడన్నారు. ఈ రోజు తిరుపతి సమీపంలోని మంచు మోహన్ బాబు విద్యాసంస్థల వద్దకు మనోజ్ వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న బౌన్సర్లు ఆయనను అడ్డుకున్నారు. దీంతో మనోజ్ బౌన్సర్లు, మోహన్ బాబుకు చెందిన బౌన్సర్ల మధ్య వివాదం తలెత్తింది. ఓ దశలో ఇరువురికి చెందిన బౌన్సర్లు కొట్టుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.
ఇది కూడా చదవండి:Srisailam: శ్రీశైలం ఆలయంలో కొట్లాట.. ఈవో Vs అర్చకులు!
తాత-నానమ్మల వర్ధంతి సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న వారి సమాధుల వద్ద నివాళులు అర్పిస్తానని మనోజ్ పట్టుబట్టారు. వారిని పోలీసులు, సిబ్బంది లోనికి అనుమతించలేదు. ఇటీవల నమోదైన కేసు కోర్టు పరిధిలో ఉన్న కారణంగా లోనికి అనుమతించలేమన్నారు. దీంతో కనీసం వారి సమాధులకు దండంపెట్టుకుని వెళ్తానని మనోజ్ వాదనకు దిగారు. మోహన్ బాబు బౌన్సర్లను అరేయ్ గేట్లు తియ్యండ్రా అంటూ గట్టిగా కేకలు వేశాడు. ఉద్రిక్తతల నడుమ మంచు మనోజ్ తో పాటు ఆయన సతీమణి భూమా మౌనికను పోలీసులు లోపలికి పంపించారు.
ఇది కూడా చదవండి:Supreme Court: ప్రభుత్వ సొమ్ము ప్రజల కోసమా ? సైకిల్ ట్రాక్‌ల కోసమా ?.. సుప్రీంకోర్టు ఆగ్రహం
నెల నుంచి పంచాయితీ..
నానమ్మ-తాత సమాధులకు దండం పెట్టుకున్న తర్వాత మనోజ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేశారు. గత నెల రోజుల నుంచి మంచు మోహన్ బాబు కుటుంబంలో అనేక సార్లు విభేదాలు బయటపడ్డాయి. గతంలో మంచు మనోజ్ పై దాడి జరగగా ఆయన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు, కోడలి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు సైతం కంప్లైంట్ చేశాడు.