AP News: తెనాలిలో రతన్ టాటాకు అరుదైన గౌరవం గుంటూరు జిల్లా తెనాలి కాటూరి శిల్పశాలలో రతన్ టాటా విగ్రహాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచం గర్వించే గొప్ప వ్యక్తిని, రతన్ టాటా విగ్రహం ఆవిష్కరించటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. By Vijaya Nimma 16 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update Minister Nadendla Manohar షేర్ చేయండి AP News: గుంటూరు జిల్లా తెనాలి కాటూరి శిల్పశాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ నేపథ్యంలో రతన్ టాటా విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రపంచం గర్వించే గొప్ప వ్యక్తి రతన్ టాటా అన్నారు. సమాజ సేవతో రతన్ టాటా ముందు ఉండేవారు, రతన్ టాటా ఎన్నో సంస్థలు స్థాపించారన్నారు. క్వాలిటీ ప్రొడక్ట్ అంటే టాటానే.. రతన్ టాటా ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారని, అనేక గొప్ప కార్యక్రమాలు చేశారని మంత్రి గుర్తు చేశారు. రతన్ టాటా విగ్రహ ఆవిష్కరణతో తెనాలి ప్రత్యేకత మరొకసారి చాటిచెప్పారు. రతన్ టాటాను స్ఫూర్తిగా నింపుకొని ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. ఇది కూడా చదవండి: కుటుంబమంతా స్నానానికి ఒకే సబ్బు వాడుతున్నారా?..అయితే జాగ్రత్త రతన్ టాటా స్ఫూర్తితో.. డబ్బులు సంపాదించడమే కాదు వాటిని విరాళాలు రూపంలో ఇవ్వటం టాటాని చూసి నేర్చుకోవాలన్నారు. టాటా ఇచ్చినన్ని విరాళాలు ప్రపంచంలోనే ఎవ్వరు ఇచ్చి ఉండరు. టాటా గొప్ప దాతగా నిలబడ్డారు. టాటా విగ్రహం ఆవిష్కరించటం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అమరావతిలో రతన్ టాటా స్ఫూర్తితో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చెయ్యటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారని మంత్రి తెలిపారు. ఇది కూడా చదవండి: తిరుపతి భక్తులకు అలర్ట్.. ఆ మార్గం మూసివేత #ratan-tata మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి