TET Exam Results:
ఏపీలో టెట్ ఫలితాలపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. టెట్ ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది. ఈ నెల 4వ తేదీన ఐటీ శాఖ మంత్రి లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా వాస్తవానికి ఈ టెట్ ఫలితాలు నవంబర్ 2న విడుదల కావాల్సి ఉండగా.. తుది ‘కీ’ వెల్లడిలో ఆలస్యం జరగడం ఫలితాల విడుదల తేదీని వాయిదా వేశారు. కాగా ఈ సోమవారం నాడు టెట్ ఫలితాలు వెలువడనున్నాయి. అయితే గత నెల అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడతలుగా విద్యాశాఖ టెట్ నిర్వహించింది. ఈ పరీక్షకు 3,68,661 మంది హాజరయ్యారు. మొత్తం 4,27,300 మంది నిరుద్యోగులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 86.28% మంది పరీక్ష రాసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Also Read: అయ్యా.. మాకు న్యాయం చేయండి.. రంగనాథ్ కు ఆ బాధితుల వినతులు!
6న మెగా డీఎస్సీ ప్రకటన!
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా పని చేస్తామని చెప్పిన కూటమి సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కొరకు మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో టీడీపీ.. తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
Also Read: నిండా ముంచింది.. కాంగ్రెస్‌పై KTR గరం!
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రకారం ఇటీవల మెగా డీఎస్సీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కాగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. తాజాగా ఈ పరీక్షకు నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 పోస్టులతో ఈ నెల 6న ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకటన విడుదల తేదీ నుంచి నెలరోజుల పాటు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం. కాగా దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read: వైఎస్ ఫ్యామిలీ రెండు ముక్కలు.. వారందరి సపోర్ట్ జగన్ కే!
Also Read: చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు, స్పాట్ లోనే భార్య భర్తలు