Sajjala Ramakrishnareddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్‌షాక్

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్‌షాక్ తగిలింది. టీడీపీ ప్రధాన కార్యాలయం పై దాడి కేసులో మంగళగిరి రూరల్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10:00 నుంచి సాయంత్రం 4 గంటల లోపు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.

New Update
Sajjala: లోకేష్ ఒక జోకర్.. సజ్జల కౌంటర్.!

Sajjala Ramakrishna : వైసీపీ (YCP) నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. గుంటూరు టీడీపీ ప్రధాన కార్యాలయం పై దాడి కేసులో ఆయనకు నోటీసులు అందాయి. మంగళగిరి రూరల్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10:00 నుంచి సాయంత్రం 4 గంటల లోపు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో 2021 అక్టోబర్‌ 19న ఆ పార్టీకి చెందిన కొందరు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి దిగారు. కాగా దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో మంగళగిరి  పోలీసులు కేసు కేసు నమోదు చేశారు.  ఈ కేసులో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను పోలీసులు విచారించారు. 

ఇది కూడా చదవండి: నేడు కోర్టుకు సీఎం రేవంత్..కానీ!

లుక్ ఔట్ నోటీసులు...

నిన్న (మంగళవారం) సజ్జల రామకృష్ణారెడ్డి కి పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో సజ్జల ప్రమేయం ఉందనే సమాచారం మేరకు ఆయన విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్‌లను ప్ పోలీసులు పలుమార్లు విచారణకు పిలిచి అసలు విషయాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పటికి ఈ కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అన్ని అధరాలు సేకరించిన పోలీసులు దాడి ఘటనలో ప్రమేయం ఉన్న ముఖ్య నాయకులను విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. 

ఇది కూడా చదవండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!

వైసీపీ నేతలే టార్గెట్...

మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై కొందరు దాడి చేశారు. ఈ కేసులో కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలశిల రఘురామ్‌‌తో పాటు 14 మంది నిందితులుగా ఉన్నారు. గత ప్రభుత్వం ఉన్న సమయంలో.. అధికారం వారి చేతిలో ఉందని వాళ్లకి నచ్చినట్లుగా రెచ్చిపోయారు. కేవలం టీడీపీ కేంద్ర కార్యాలయంపై మాత్రమే దాడికి పాల్పడకుండా ఆ ప్రాంతాల్లో కూడా బీభత్సం సృష్టించారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందస్తు బెయిల్ కోసం వీరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. తాజాగా సజ్జలకు కూడా పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: విషాదం.. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు