AP: మా కులాన్ని అవమానిస్తావా.. పవన్ పై మందకృష్ణ ఫైర్!

ఏపీ హోం మంత్రి అనితను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై మంద క్రిష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ నోటి నుంచి అలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమన్నారు. పవన్ మాటలు ప్రభుత్వానికి నష్టం.. మా కులానికి అవమానం అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

New Update
se e

Manda krishna: ఈ మేరకు పరిపాలనకు సంబంధించిన అంశాలు మంత్రివర్గంలోనో, అంతర్గతంగా మాట్లాడుకోవాలి. కానీ హెం మంత్రి హోదాలో ఉన్న దళిత బిడ్డను అవమానించడం సరైనది కాదు. అది సీఎం పరిపాలనపైనే విమర్శలు చేసినట్లు. అది ప్రభుత్వానికి నష్టం. మా కులానికి అవమానం. ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాం. సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్ మాదిగలకు ఎక్కడ న్యాయం చేసారు? జనసేన అంటే ఒకటి రెండు కులాల పార్టీనా? అందరి పార్టీనా? మూడు మంత్రి పదవుల తీసుకుని ఒక్కటీ కూడా బీసీ, ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదని మందకృష్ణ ప్రశ్నించారు. కమ్మ, కాపులు మాత్రమే జనసేనకు ఓట్లు వేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ఇది కూడా చదవండి: Warangal: 2050 విజ‌న్‌తో.. ఓరుగల్లు ఎలా మారబోతుందంటే!?

ప్రభుత్వాన్నే కాదు సీఎంను కూడా అన్నట్టే..

హోంమంత్రిని అంటే ప్రభుత్వాన్ని అన్నట్టే కాదు సీఎంను కూడా అన్నట్టే. మాలలకు ఇచ్చిన ప్రాధాన్యత మాకు ఇవ్వలేదు. పవన్ సామాజిక న్యాయం గురించి ఎలా మాట్లాడతాడు. మాట్లాడే సమయం వచ్చినపుడు అన్ని విషయాలు మాట్లాడతాం. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు స్తంభాలైతే నాల్గవ స్తంభం ఎమ్మార్పీఎస్ పని చేసి గెలుపు బాటలో నిలబెట్టింది. మేం ప్రభుత్వ లో భాగస్వాములం కాకపోయినా ఫలితం మా బిడ్డలకు దక్కాలి. మాదిగలు సంతృప్తి పడేలా భాగస్వామ్యం ఉండేలా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కేబినెట్ అంటే కుటుంబం. పవన్ మాటలు ప్రభుత్వానికి నష్టం.. మా కులానికి అవమానం. రేపు పవన్ మాటలు ఆయన శాఖకు కూడా వర్తిస్తాయని మందకృష్ణ అన్నారు.

ఇది కూడా చదవండి: బతకాలంటే బహిరంగ క్షమాపణ.. లేదంటే రూ.5 కోట్లు.. సల్మాన్‌కు వార్నింగ్

Advertisment