AP Crime: తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌లో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అయితే హత్యకు 1500 రూపాయల లావాదేవీలే కారణంగా అనుమానిస్తున్నారు. కూరగాయల మార్కెట్‌లో కలికిరికి చెందిన అజమతుల్లా టమోటాల వ్యాపారం చేస్తుంటాడు. మరో వ్యాపారి రుద్రతో గొడవ జరిగింది. ఆర్థిక లావాదేవీల కారణంగా గొడవ జరిగిందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఉదయం బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం మంచిదేనా?
1500 కోసం హత్య:
ఇది కూడా చదవండి: క్యాన్సర్ లక్షణాలను ఎలా గుర్తించాలి?
దీంతో రుద్ర తన కుమారులు, అనుచరులతో కలిసి వచ్చి అజమతుల్లాను దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యతో కూరగాయల మార్కెట్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణ పూర్తయితే అన్ని వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: గురుకులాల్లో ఆగని మరణాలు... ఖమ్మంలో మరో విద్యార్థి ఆత్మహత్య