/rtv/media/media_files/2025/10/22/amazon-1-2025-10-22-21-38-11.jpg)
ప్రముఖ ఈ కామర్స్ సంస్థకు కర్నూల్ జిల్లా కన్స్యూమర్ ఫోరంలో చుక్కెదురైంది. అమెజాన్‌పై కర్నూలు జిల్లా కన్స్యూమర్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. అమెజాన్‌లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ పెట్టాడు. ఐఫోన్ 15ప్లస్‌కు బదులు డెలవరీలో ఐక్యూ ఫోన్ వచ్చింది. అది చూసి కస్టమర్ షాక్ అయ్యాడు. దీంతో అమెజాన్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు.
బాధితుడు కస్టమర్ కేర్‌తో మాట్లాడినా ఫలితం లేకపోవడంతో.. కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు. బాధితుడికి ఐఫోన్ డెలవరీ చేయకపోతే.. రూ.80 వేలు రీఫండ్ చేసి, మరో రూ.25వేలు చెల్లించాలని కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం అమెజాన్ సంస్థను ఆదేశించింది.
విచారణ చేపట్టిన కోర్టు.. అమెజాన్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్‌కు ఐఫోన్ డెలివరీ చేయాలని, లేదంటే రూ.80వేలు రిఫండ్ చేయాలని సూచించింది. అదనంగా రూ.25,000 నష్టపరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది. అయితే, అమెజాన్ సంస్థ ఆ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా వేసింది.