Jagan : జగన్‌కు కొడాలి నాని, వల్లభనేని వంశీ షాక్ జగన్‌కు కొడాలి నాని, వల్లభనేని వంశీ షాక్ ఇచ్చారు. ఈరోజు దేవాలయాల్లో ప్రక్షాళన పూజలు చేయాలని జగన్ ఇచ్చిన పిలుపునకు వారు దూరంగా ఉన్నారు. గత మూడు నెలలుగా గుడివాడ, గన్నవరంలో వారి కనిపించకపోవడంతో అక్కడి వైసీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. By V.J Reddy 28 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Jagan - Kodali Nani : వైసీపీ (YCP) అధినేత, మాజీ సీఎం జగన్ కు కొడాలి నాని, వల్లభనేని వంశీ షాక్ ఇచ్చారు. నియోజకవర్గాల్లోని దేవాలయాల్లో ప్రక్షాళన పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల్లో నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కానీ జగన్ ఇచ్చిన పిలుపునకు కొడాలి నాని, వల్లభనేని వంశీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుడివాడ, గన్నవరంలో ఎలాంటి కార్యక్రమాలను చేపట్టనట్టు సమాచారం. మొన్న జగన్ తో సమావేశమైన వీరు.. అనంతరం హైదరాబాద్ కు వెళ్లిపోయారు. గత మూడు నెలలుగా నియోజకవర్గానికి రాకపోవడంతో గందరగోళం లో గుడివాడ, గన్నవరం వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. అధినేత ఆదేశాలు ఉన్న నియోజకవర్గానికి రాకపోవడంపై స్థానిక నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా.... నియోజకవర్గాల్లోని దేవాలయాల్లో ప్రక్షాళన పూజలు చేయాలని జగన్ ఇచ్చిన పిలుపు మేరకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు పూజలు నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొరిటిపాడులోని శ్రీ కళ్యాణ రామాలయంలో మాజీ మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈరోజు ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు వైయస్‌ఆర్‌సీపీ నేతలు పూజలు చేస్తున్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన @ncbn పాపానికి ప్రక్షాళన కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ నేతలు పూజలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొరిటిపాడులోని శ్రీ కళ్యాణ రామాలయంలో మాజీ మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి,… pic.twitter.com/DrMVBYJfaq — YSR Congress Party (@YSRCParty) September 28, 2024 Also Read: స్టీల్ ప్లాంట్ లో 4 వేల మంది కార్మికులు ఔట్! #ys-jagan #ap-ycp #kodali-nani #vallabhaneni-vamsi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి