CM Jagan: ఆ రోజే సీఎం జగన్ నామినేషన్
సీఎం జగన్ నామినేషన్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు. ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ పులివెందుల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
సీఎం జగన్ నామినేషన్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు. ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ పులివెందుల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి దారుణంగా చంపిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నది జగన్ అని ఆరోపించారు షర్మిల. ఈ దారుణాలు చూడలేకనే తాను పోటీ చేస్తున్నానన్నారు. పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల జగన్, అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు షర్మిల. ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. నిరుద్యోగులను మోసం చేశారని ఫైర్ అయ్యారు. సొంత లాభాల కోసమే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చామని జగన్ సర్కార్ చెప్పుకుంటుందని మండిపడ్డారు.
ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఈ రోజు కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను బెంగళూరులోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల కొడుకును కసాయి తండ్రి కొట్టి చంపాడు. ముస్తకీమ్ అనే చిన్నారిపై సవతి తల్లి చాడీలు చెప్పడంతో తండ్రి ఇమ్రాన్ బాబును చావబాదాడు. చిన్నారి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏపీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడని అన్ని ఆధారాలున్నా అతన్ని జగన్ కాపాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి జగన్ రాజకీయ వారసుడే కాదన్నారు.
కడప జిల్లా బద్వేల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అవినాష్ రెడ్డి షర్మిలపై విమర్శలు గుప్పించారు. మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణా జ్ఞానం ఉండాలన్నారు. మా గురించి చెడ్డగా ఎంత ప్రచారం చేసుకుంటారో చేసుకోండి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని కామెంట్స్ చేశారు.
బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్‌కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారు? అని అన్నారు షర్మిల. ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మాత్రమే ముస్లింలకు భరోసా ఇస్తుందని అన్నారు.
అవినాష్ రెడ్డి ఓడిపోవాలనేదే తన లక్ష్యమని వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య చేసిన వారు చట్టసభల్లో ఉండకూడదన్నారు. తనకు రాజకీయాలు ఇష్టం లేదని..న్యాయం మాత్రమే కావాలని స్పష్టం చేశారు. షర్మిలకు మంచి పేరు రావడంతో జగన్ ఆమెను పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు.