AP Politics: నాది ఫ్యాక్షన్ కుటుంబమే.. చావడానికైనా చంపాడానికైనా సిద్ధం: బీటెక్ రవి
కడప జిల్లా పులివెందుల టీడీపీ కార్యాలయంలో బీటెక్ రవి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ఈ రోజు పులివెందులలో ఓటుకు 2000 పంచే దీనస్థితికి వచ్చారంటే ప్రజల్లో వ్యతిరేకతోందని ఓటమిని అంగీకరించినట్లే అని అన్నారు. పేదవాడినైనా నాకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.