Kadapa: కడపలో ఏటీఎం చోరీల కలకలం.. ఒకే రోజు 3 చోట్ల దొంగలు ఏం చేశారంటే?

కడప జిల్లాలో ఏటీఎం దొంగతనాలు దుమారం రేపుతున్నాయి. నగరంలోని పలు ఏటీఎంలో డబ్బు చోరీకి గురైంది. విశ్వసరాయ సర్కిల్ వద్ద చోరీకి ప్రయత్నించగా సైరాన్ మోగడంతో దొంగలు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.  

author-image
By Kusuma
atm
New Update

AP : కడప జిల్లా వ్యాప్తంగా ఏటీఎం దొంగతనాలు అలజడి సృష్టిస్తున్నాయి. నగరంలోని పలుచోట్ల ఉన్న ఏటీఎంలో కొందరు దుండగులు నగదు చోరీకి పాల్పడుతున్నారు. నగరంలోని ద్వారక నగర్‌లో ఉన్న ఏటీఎంలో 6,19300 లక్షల రూపాయలు దొంగతనం చేయగా.. ఒంటిమిట్ట ఏటీఎంలో కూడా 37 లక్షల రుపాయలు చోరీ చేశారు. నగరంలో ఉన్న విశ్వసరాయ సర్కిల్‌ దగ్గర ఏటీఎం‌ను చోరీ చేయడానికి దుండగలు ప్రయత్నించారు. ఇంతలో సైరాన్ మోగడంతో దొంగలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసుల వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  నేటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష

#kadapa #atm-cash-theft
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe