జెత్వానీ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఫోన్ లాక్ కోసం తప్పుడు కేసు పెట్టి!

ముంబై నటి జెత్వానీ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి. జెత్వానీ సెల్ ఫోన్స్ పాస్ వర్డ్ తెరిపించడం కోసం ఢిల్లీలో ఉన్న ఆమె స్నేహితుడు అమిత్‌సింగ్‌ను బెజవాడ వ్యభిచారం కేసులో అన్యాయంగా ఇరికించినట్లు అధికారులు గుర్తించారు. 

drerersee
New Update
Jetwani Case : ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో మరో సంచలన విషయం బయటపడింది. జత్వానీపై తప్పుడు కేసులుపెట్టినట్లే ఆమె స్నేహితుడు అమిత్‌సింగ్‌ను అరెస్టు చేయడానికి ఫేక్ కేసు క్రియేట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు జెత్వానీని ఫిబ్రవరి 3న ముంబై నుంచి తీసుకొచ్చి, నాలుగో తేదీన విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆమెను ఐదు రోజుల పాటు కస్టడిలోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే ఆమె ఐదు యాపిల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిలో ఉన్న ఆధారాలను సేకరించేందుకు పాస్‌వర్డ్‌లు చెప్పాలని ఒత్తిడి చేశారు. ఆమె ఎంతకి చెప్పకపోవడంతో పోలీసులు విద్యాసాగర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో విద్యాసాగర్‌ మరో టాస్క్‌ ఇచ్చాడు. 

విద్యాసాగర్‌ ఇచ్చిన రెండో టాస్క్‌..

అమిత్‌సింగ్‌ అనే వ్యక్తితో జత్వానికి మంచి పరిచయం ఉందని, అన్ని తీసుకొస్తే అన్ని వివరాలూ బయటకొస్తాయని సలహా ఇచ్చాడు. అప్పటికే ఇబ్రహీపట్నం స్టేషన్‌లో జెత్వానీపై కేసు నమోదుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి.. విద్యాసాగర్‌ ఇచ్చిన రెండో టాస్క్‌లో పెద్దగా ఆలోచించకుండానే రంగంలోకి దిగారు. దీంతో ఢిల్లీలో అమిత్‌సింగ్‌ను ఎలాంటి ఆధారం లేకుండా తీసుకొస్తే ఇబ్బంది అవుతుందని భావించి ఫిబ్రవరి 11న బెజవాడలోని చంద్రబాబునాయుడు కాలనీలోని ఒక స్పా కేంద్రంలో సోదాలు నిర్వహించారు. వ్యభిచారం పేరుతో మణిపూర్‌కు చెందిన కొందరు యువతులపై కేసు నమోదు చేశారు. స్పా సెంటర్‌ నిర్వాహకురాలు తమాంగ్‌ను ఏ-1గా చేర్చారు. ఏ-2గా అమిత్‌సింగ్‌ను ఇరికించారు. నిజానికి అమిత్ ఆ రోజు ఢిల్లీలోనే ఉండటం విశేషం. అసలు కథ ఇక్కడే బయటపడింది. 

11న సోదాలు 10న ఢిల్లీకి విమాన టికెట్లు బుక్‌..

ఈ మేరకు జత్వానీపై ఫిబ్రవరి 2న ఫిర్యాదు అందితే పోలీసులు కమిషనర్‌ కార్యాలయం నుంచి ముంబై వెళ్లడానికి 1వ తేదీన విమాన టికెట్లు బుక్‌ చేశారు. అలాగే స్పా సెంటర్ లో ఫిబ్రవరి 11న సోదాలు నిర్వహించి వ్యభిచారం జరుగుతున్నట్లుగా ప్రచారం చేసి 10వ తేదీన ఢిల్లీ విమాన టికెట్లు బుక్‌ చేసుకోవడం విశేషం. ఇక విద్యాసాగర్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసు బృందం ఢిల్లీ వెళ్లి.. అమిత్ కోసం వెతికింది. అతను దొరకకపోవడంతో ఆందోళన మొదలైంది. దీంతో ఇబ్రహీంపట్నంలో జెత్వానీపై నమోదు చేసిన తప్పుడు కేసులో ఐపీఎస్‌ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీ, డీఎస్పీ హనుమంతరావు, ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణను సస్పెండ్‌ చేశారు. వాళ్లందరినీ కాదంబరి ఫిర్యాదుతో నమోదు చేసిన కేసులో నిందితులుగా చేర్చారు. పటమటలో నమోదు చేసిన అమిత్‌సింగ్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 

#ap-news #kadambari-jethwani
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe