Jogi Ramesh: వైసీపీకి జోగి రమేష్ గుడ్ బై..! వైసీపీ కీలక నేత, కృష్ణాజిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా జోగి అనుచరులకు చెందిన సోషల్ మీడియాలో ‘మా అన్న మారుతున్నాడహో!’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. By Bhavana 22 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Jogi Ramesh: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నుంచి నాయకులు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. చోటా మోటా నేతల నుంచి కీలక నాయకుల వరకు కూడా చాలా మంది క్యూ కట్టి మరీ బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో.. కీలక నేత, కృష్ణాజిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ కూడా చేరిపోతున్నట్టు తెలిసింది. మా అన్న పార్టీ మారుతున్నాడు... తాజాగా జోగి అనుచరులకు చెందిన సోషల్ మీడియాలో ‘మా అన్న మారుతున్నాడహో!’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ''మా అన్న పార్టీ మారుతున్నాడు” అన్న పోస్టు ట్రెండింగ్‌గా మారింది. Also Read: కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్.. బండి విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ దీంతో జోగి రమేష్.. కుటుంబ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌తో రాజకీయాలు ప్రారంభించిన జోగి.. వైసీపీ హయాంలో మంత్రి అయ్యారు. అయితే.. దీనికి ముందు ఆయన చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఉండవల్లిలోని ఆయన నివాసంపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, ఇప్పుడు ఆ కేసు విచారణ పుంజుకుంది. Also Read: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..పండగ చేస్కోండి! మరోవైపు.. జోగి కుమారుడు.. జోగి రాజీవ్.. అగ్రిగోల్డ్ భూముల కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కొన్నాళ్లు జైల్లో ఉండడం.. ఇటీవల బయటకు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనూహ్యంగా జోగి రమేష్ యూటర్న్ తీసుకోవడం.. వైసీపీకి గుడ్ బై చెబుతున్నారన్న సమాచారం బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వైసీపీకి, ముఖ్యంగా జగన్‌కు నమ్మిన బంటుగా ఉన్న జోగి రమేష్.. జగన్ ఎంత చెబితే అంత అన్నట్టుగా వ్యవహరిస్తారని టాక్ ఉంది. Also Read: కిలో వెండి అక్షరాల లక్ష రూపాయలు! కేసులు నమోదైనప్పుడు కూడా.. జోగి పార్టీని, జగన్‌ను కూడా వెనుకేసుకు వచ్చారు. అయితే, ఆయా కేసుల్లో తీవ్రత పెరుగుతుండడం.. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగిని అరెస్టు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ మార్పు దిశగా జోగి ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరగడం సంచలనంగా మారింది. పార్టీ మారాల్సి వస్తే.. జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అంతేకాదు.. తాను గతంలో చేసిన అన్ని పనులను వైసీపీ పెద్దలు చెబితేనే చేశానని పోలీసుల ముందు ఒప్పుకొనే అవకాశం కూడా కనిపిస్తుండడం గమనార్హం. Also Read: త్వరలో 6,100 ఉద్యోగాలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి