Tulasi Reddy : జనసేన రద్దు..బీజేపీలో విలీనం..కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్‌ తన జనసేనను రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని రాజ్యసభ మాజీసభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సూచించారు. పవన్‌ది ఏ సిద్ధాంతం? చేగువేరా సిద్ధాంతమా? సనాతన ధర్మ సిద్ధాంతమా?లేక ఊసరవెల్లి సిద్ధాంతమా? అంటూ విమర్శించారు.

New Update
Pawan Kalyan-tulasi reddy

Pawan Kalyan-tulasi reddy

Tulasi Reddy : పవన్‌ తన జనసేనను రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని రాజ్యసభ మాజీసభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సూచించారు. పవన్‌ది ఏ సిద్ధాంతం? చేగువేరా సిద్ధాంతమా? సనాతన ధర్మ సిద్ధాంతమా?లేక ఊసరవెల్లి సిద్ధాంతమా? అంటూ విమర్శించారు.  తులసిరెడ్డి శనివారం విజయవాడలో కాంగ్రెస్ రాష్ర్ట కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీ మొదటినుండి ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ అంటే బాబు,జగన్,పవన్ అని చెబుతూ వచ్చిందని, బీజేపీ చేతిలో వీళ్ళు ముగ్గురూ కీలు బొమ్మలని అంటున్నామని, అది నిజమని నిన్నటి పిఠాపురం జన సేన సభ నిరూపించిందని తులసి రెడ్డి అన్నారు.

ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

తనకు పదవి పిచ్చి లేదని,సైద్ధాంతిక బలం వుందని పవన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పదవి పిచ్చి లేకుంటే ఉప ముఖ్య మంత్రి పదవి ఎందుకు? సోదరుడు నాగబాబుకు MLC పదవి ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. కడప జిల్లాలో కాసినాయన ఆశ్రమాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చడమేనా మీరు వల్లించే సనాతన ధర్మం? అంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీని తానే నిలబెట్టినట్లు పవన్ చెప్పడం విడ్డూరం. తాతకు మనుమడు దగ్గు నేర్పినట్లుంది పవన్ వాలకం అంటూ దెప్పి పొడిచారు. నిన్నటి పిఠాపురం సభ మొత్తం ఆత్మ స్తుతి  పరనింద గా సాగిందన్నారు. సొంత డబ్బా వాయించుకోవడం తోనే సరిపోయిందని  సూపర్ సిక్స్ హామీల ప్రస్తావనే లేదని విమర్శించారు.

ఇది కూడా చూడండి:Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!


మంత్రుల పనితీరులో పవన్ కు 10 వ రాంకు రావడం గమనార్హమని, రాష్ర్ట వ్యాప్తంగా గ్రామ పంచాయితీలు మురికి కూపాలుగా తయారయ్యాయి.అటవీ శాఖ అనుమతులు రాక అనేక పనులు ప్రారంభం కాలేదని తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా పవన్‌ ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకొని తన శాఖ మీద దృష్టి కేంద్రీకరించాలని తులసి రెడ్డి  సూచించారు..

Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు