Ap Rains: ఏపీలోకి మరోసారి వరుణుడు రానున్నాడు. మొన్నటి వరకూ ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో విపరీతంగా వానలు పడ్డాయి. అయితే ఇప్పుడు మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది. నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read: Balakrishna: మాజీ సీఎం జగన్‌కు బాలకృష్ణ బిగ్ షాక్!
రాగల 48 గంటల్లో ఈ ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఏపీలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
Also Read: Karthikamasam :ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు..లక్ష్మీదేవి మీ ఇంట్లోనే!
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...
ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తర కోస్తా, యానాంలలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ శనివారం కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also Read: కేసీఆర్ హయాంలో కీలకంగా ఉన్న ముగ్గురు ఐఏఎస్‌లకు బిగుస్తున్న ఉచ్చు!
ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు, శుక్రవారం అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది.
మరోవైపు ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో ఏపీలో తీరం వెంబడి ఇప్పటికే గాలులు బలంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీటి ప్రభావంతో పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. అలాగే రాత్రివేళ చలిగాలులు విపరీతంగా వీస్తాయని అధికారులు చెబుతున్నారు.
Also Read: కుటుంబ సర్వేకు ఆటంకాలు సృష్టిస్తే కఠిన చర్యలే: మంత్రి శ్రీధర్ బాబు
ఇక అల్పపీడనం ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉండనుంది. దీంతో జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని అక్కడి ప్రభుత్వం ఇప్పటికే మత్స్యకారులను ఆదేశించింది. 19 జిల్లాలలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో.. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురానికి వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.