Ap Rains:ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది.. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. బంగాళాఖాతంలో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షాయజీ షిండే.. ఏ పార్టీలో చేరారంటే ?
ఇది 14వ తేదీ వరకు నేరుగా వాయుగుండంగా.. 15 నాటికి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని అధికారులు తెలిపారు. ఇది 15వ తేదీన తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: తెలంగాణ ఆరోగ్యశాఖలో జాబ్స్...371 నర్సింగ్ పోస్టులు
14, 15, 16 తేదీల్లో..
రాష్ట్రవ్యాప్తంగా 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అక్డోబర్ 11న భారీ వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 12న పిడుగులతో కూడిన కుంభవృష్టి.. అక్టోబర్ 13న పిడుగులతో పాటూ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అక్టోబర్ 14న భారీ వర్షం, పిడుగులతో కూడిన భారీగా వానలు.. అక్టోబర్ 15న అతి భారీ వర్షం తో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
Also Read: బొగ్గుగనిలో దుండగుడి కాల్పులు...20 మంది మృతి!
ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్‌లు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం ఏపీపై ఉంటుందని భావిస్తున్నారు. శనివారం అనంతపురం, శ్రీ సత్యసాయి కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.
Also Read: లెబనాన్‌లోని ఐరాస కార్యాలయం పై దాడి..ఖండించిన భారత్!
అలాగే అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
Also Read: సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్