/rtv/media/media_files/2025/10/20/jc-prabhakar-reddy-2025-10-20-19-09-37.jpg)
JC Prabhakar Reddy
JC Prabhakar Reddy : నా ఆయుష్షు గురించి మాట్లాడేవారు ఒకసారి ఆలోచించి మాట్లాడండి.. మీరు ఏది మాట్లాడినా చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరు అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఇటీవల ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటున్నాడు.. అలా అంటే మేము చూస్తూ ఊరుకోవాలా..? అని జేసీ ప్రభాకర్ సీరియస్ అయ్యారు.
మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడండి.. నీకు భవిష్యత్తు చాలా ఉంది.. దాన్ని నాశనం చేసుకోకు అంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. చంద్రబాబు నాయుడు మంచివాడు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారని జేసీ వ్యాఖ్యానించారు. నా ఆయుష్సూ గురించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెబుతున్నాడు.. మూడేళ్లు బతుకుతాడు అని అంటున్నాడు. దేవుడి ఆశీస్సులు ఉంటే ఏదైనా జరగొచ్చు. కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పుడూ ఎమ్మెల్యే కాలేడు అంటూ ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పారు.కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చిన్నవాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు కాబట్టి అతనికి మళ్లీ ఎమ్మెల్యే అయ్యేందుకు అవకాశం ఉండొచ్చునని జేసీ అభిప్రాయపడ్డారు.
అలాగే రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై జరుగుతున్న విమర్శలను జేసీ తప్పుబట్టారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే తప్పేముంది. సెంట్రల్ రైలు సర్వీసులు ప్రైవేటీకరణ చేయలేదా..? వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు ఏమి చేస్తున్నారు..? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రైవేట్ ఆస్పత్రికి ఎందుకు వెళ్లాడు. నీకు ఈసారి ఆరోగ్యం బాగాలేకపోతే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకోకు అన్నారు. అనంతపురం జిల్లాలో కోవిడ్ సమయంలో అదుపు చేసింది ఒక్క ఆర్డిటి సంస్థ మాత్రమే అది ప్రైవేట్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. చివరకు నేను కూడా తాడిపత్రి మున్సిపాలిటీలో ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించుకుంటున్నానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
Also Read : దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే..!
Follow Us