ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌లకు కీలక పోస్టింగ్‌లు.. ఆమ్రపాలికి ఏదంటే?

ఏపీకి వెళ్లిన ఐదుగురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం కీలక పోస్టింగ్‌లు కేటాయించింది. టూరిజం శాఖ ఎండీగా ఆమ్రపాలి, వైద్యారోగ్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణి మోహన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌కు పోస్టింగ్ ఇచ్చింది.

HMDA: హెచ్ఎండిఏలో బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి
New Update

ఐఏఎస్ అధికారులు తమ సొంత కేడర్ రాష్ట్రాలకు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. దీంతో ఐఏఎస్‌ అధికారులు రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి మోహన్, వాణి ప్రసాద్‌లు సీఎస్ నీరబ్ కుమార్‌‌కు గురువారం రిపోర్ట్ చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ ఐదుగురు ఐఏఎస్‌లు తమ జాయినింగ్ రిపోర్ట్‌ను సీఎస్‌‌కు సమర్పించారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఏపీలో అడుగుపెట్టిన ఈ అయిదుగు ఐఏఎస్‌ అధికారులకు ఎలాంటి శాఖలు కేటాయించనున్నారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

ఇది కూడా చదవండి: మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్!

ముఖ్యంగా డ్యాషింగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆమ్రపాలికి ఏ శాఖ ఇవ్వనున్నారు? అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. గతంలో ఆమ్రపాలి ప్రధాని కార్యాలయం పీఓంలో విధులు నిర్వర్తించారు. అక్కడ దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలను ఆమె పర్యవేక్షించారు. 

ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు

సుదీర్ఘకాలం పాటు ఆమె విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత తెలంగాణ సర్కార్ ఆమెను కేంద్రం నుంచి రప్పించి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించింది. అలాంటి ఆమ్రపాలిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇప్పుడు తన టీంలోకి తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా?

ఆమ్రాపాలి సేవలను పవన్ కళ్యాణ్ తన శాఖలోనే వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపించింది. అంతేకాకుండా ఆమ్రాపాలి సొంతూరు ప్రకాశం జిల్లా కాగా.. ఆమె వైజా‌లో చదువుకున్నారు. దీంతో ఆమెను వైజాగ్ మున్సిపాల్ కమిషనర్‌గా నియమించే అవకాశాలున్నాయని వార్తలు జోరుగా సాగాయి.

ఇది కూడా చదవండి: Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా

ఆమ్రపాలి పోస్టింగ్ ఇదే?

ఎట్టకేలకు ఈ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పోస్టింగులను కేటాయించింది. ఏపీలో అడుగుపెట్టిన ఈ ఐదుగురు ఐఏఎస్‌ అధికారులలో టూరిజం శాఖ ఎండీగా ఆమ్రపాలి, వైద్యారోగ్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణి మోహన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌లకు పోస్టింగులు కేటాయించారు. అదే సమయంలో రోనాల్డ్ రాస్ పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 

#ap-cm-chandrababu #ap
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe