Jhony Master Arrest: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు పెట్టిన యువతి 2017 లో ఢీ షోలో జానీ మాస్టర్ కు పరిచయమైంది, ఆ తర్వాత 2019లో జానీ మాస్టర్ టీం లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యింది.
ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడి హోటల్లో జానీ తన పై అత్యాచారానికి పాల్పడినట్లు యువతి పోలీసులకు తెలిపింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ జానీ బెదిరించడాని, అంతేకాకుండా షూటింగ్ సమయంలో కూడా అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఎంతసేపు మతం మార్చుకోవాలని, తనను పెళ్లి చేసుకోవాలంటే బలవంతం చేసేవాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదులో తెలిపింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా యువతిని విచారించిన పోలీసులు ‘జానీ మాస్టర్ కోరికలకు యువతి ఒప్పుకోకపోవడంతో బాధితురాలు జుట్టు పట్టుకొని జానీ మాస్టర్ దాడి చేశాడని, అలాగే ఆగస్టు 28న బాధితురాలికి ఒక వింత పార్శిల్ వచ్చింది, పేరు లేకుండా వచ్చిన ఆ పార్సిల్ తెరిచి చూడగా దాని లోపల ‘ Congratulations for son be care full’ అని రాసి ఆమె ఇంటి తలుపుకు వేలాడతీసాడని’ పోలీసులు FIR లో నమోదు చేశారు.
జానీ ప్రస్తుతం ఎవరికీ అందుబాటులోకి లేడని, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి సమాచారం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని తెలిసింది. కేసు దర్యాపు వేగవంతం చేసిన నార్సింగి పోలీసులు తాజాగా జానీ మాస్టర్ కు నోటీసులు అందజేశారు. విచారణకు వెంటనే రావాలని, వీలైనంత త్వరగా తమ ముందు హాజారుకావాలని పోలీసులు నోటిసుల్లో పేర్కొన్నారు పోలీసులు. ఇదిలా ఉంటే కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానీని తొలగించారు.
ఈ క్రమంలో జానీ నెల్లూరు పారిపోయినట్లు తెలుస్తుంది.దీంతో నార్సింగి అధికారులు నెల్లూరు పోలీసులను సంప్రదించారు. సెక్షన్ 41-A ప్రకారం నోటీసులు ఇచ్చి… తొలుత విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం రోజుల్లో వచ్చి వివరణ ఇస్తే సరి… లేదంటే జానీ మాస్టర్‌ని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.
Also Read: Samineni Udayabhanu: వైసీపీకి మరో బిగ్ షాక్.. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే!