/rtv/media/media_files/2025/09/13/guntur-2025-09-13-14-49-46.jpg)
గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో కొత్త రోగం ఇప్పుడు అందర్నీ భయాందోళనలకు గురిచేస్తుంది. ఇటీవల సంభవించిన అనివార్య మరణాలను చూసి అందరూ భయపడిపోతున్నారు. గ్రామానికి ఏమైనా పీడ పట్టుకుందా అనే ఓ మూఢనమ్మకం కూడా అందరిలోనూ మొదలైంది. గ్రామస్తులు గ్రామంలో ఉన్న బొడ్రాయి పక్కకు జరగడంతోనే ఈ అరిష్టం పట్టుకుందంటూ బొడ్రాయికి జలాభిషేకం చేసి పూజలు కూడా చేశారు. అయితే ఈ మరణాల వెనుక మెలియాయిడోసిస్ అనే ఓ వైరస్ ఉన్నట్లుగా వైద్యులు తేల్చారు. ఇప్పుడు ఆ గ్రామంలో ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తు్న్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో కొద్దీగా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ పక్కా గ్రామంలో కేసులు పెరగడం మరింత ఆందోళనను పెంచుతుంది.
పెరుగుతున్న కేసులు
చేబ్రోలు మండలంలోని కొత్తరెడ్డిపాలెంలో జ్వరాల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని పీహెచ్ సీ డాక్టర్ ఊర్మిళ తెలిపారు. కేసులు పెరిగిపోతుండటంతో రోగులకు బ్లడ్ కల్చర్ టెస్టులు చేయగా.. ఐదుగురికి స్టెఫెలో కొకై బ్యాక్టీరియా పాజిటివ్ గా తేలిందని వివరించారు. మరొకరికి మెలియాయిడోసిస్ ఉందని తేలిందన్నారు. మరిన్ని టెస్టుల కోసం బ్లడ్ శాంపిల్స్ ను గుంటూరు జీజీహెచ్ కు పంపినట్లుగా వెల్లడించారు. అయితే ఈ వైరస్ పై అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇక చేబ్రోలుకు చెందిన ఆశావర్కర్ సులోచన (45) జ్వరం, ఉబ్బసం లక్షణాలతో ఈనెల 12న మరణించడంతో.. ఆమె మరణంపై కూడా గ్రామస్థు్ల్లో చాలా అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఆమె బ్లడ్ టెస్ట్ రిపోర్టుల్ని డాక్టర్లు మరోసారి చెక్ చేస్తున్నారు.
మెలియాయిడోసిస్ లక్షణాలు అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో, ముఖ్యంగా డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మరింత తీవ్రంగా ఉండవచ్చు. ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స అందకపోతే, ప్రాణాంతకం కావచ్చు. ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.