Ex CM Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడేపల్లిలోని ఆయన నివాసాన్ని బీజేపీ యువ మోర్చా నేతలు ముట్టడించారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేశారని ఆందోళనకు దిగారు. జగన్ క్షమాపణలు చెప్పాలంటూ ఇంటి ముందు బైఠాయించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేపట్టారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
Also Read : జోబైడెన్ దంపతులకు మోదీ స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?
తిరుమల లడ్డూపై జగన్...
తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ సీఎం చంద్రబాబు డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఈ నెల 20న ప్రెస్ మీట్ లో ధ్వజమెత్తారు జగన్. రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. నెయ్యి కి బదులు జంతువుల కొవ్వుతో లడ్డూ తాయారు చేశారంటూ.. సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సబబేనా? అని నిలదీశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు అల్లుకున్న కట్టుకథలు ఇవి అని ఫైర్ అయ్యారు. ప్రతీ 6 నెలలకు ఓసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారన్నారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరూ మార్చలేదని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరిగిందన్నారు.
Also Read : జగన్ ఇంటి వద్ద హైటెన్షన్
జగన్ కు సీఎం చంద్రబాబు కౌంటర్...
నిన్న జరిగిన మీడియాతో చిట్ చాట్ లో తిరుమల (Tirumala) పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు సీఎం చంద్రబాబు. జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలి పెట్టమని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామన్నారు. గత ప్రభుత్వంలో రాముడి తల తీసేస్తే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్వేదిలో రథం తగలపెడితే పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగినా చర్యలు లేవన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో తాను ఒకటికి పదిసార్లు ఆలోచిస్తానన్నారు. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగని దుర్మార్గాలు చూస్తూ ఊరుకోలేమన్నారు. లడ్డూను కల్తీ చేయడమే కాక జగన్ ఎదురుదాడి చేస్తారా? అని ఫైర్ అయ్యారు.
Also Read : శ్రీశైలంలో దారుణం.. మద్యం మత్తులో వ్యక్తి గొంతుకోసిన దుండగులు