/rtv/media/media_files/2025/05/29/k0WFvHvqmf1ojFGhvLYR.jpg)
Maoist Key Leader Hidma Arrested
BIG BREAKING: ఏపీలో మావోయిస్టుల కలకలం రేగుతోంది. నిన్న ఏజెన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు చనిపోగా వారిలో అగ్రనేత హిడ్మా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆయన దగ్గర దొరికిన డైరీ ఆధరంగా పలువురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మావోయిస్టుల కలకలం రేగింది. జిల్లాలోని రావులపాలెంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మద్వి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన అనుచరుడు మాధవిహండా సరోజ్ రావులపాలెంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సరోజ్ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి. రావులపాలెం ఎందుకు వచ్చారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే హిడ్మా డైరీలో ఉన్న సమాచారంతోనే అనుచరుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: తన వాళ్ల కోసమే బ్రతికే మగ మహానుభావులందరికి హ్యాపీ మెన్స్ డే!!
Follow Us