Lokesh : జగన్ పాలనలో ఉద్యోగులు బలవుతున్నారు.. లోకేష్ గరం!
జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ పాలనని అంతమొందిచేందుకు ఉద్యోగులంతా ఆత్మస్థైర్యంతో ఉండాలని కోరారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.