గుంటూరులో జగన్ ప్రచారం-LIVE
ఏపీ సీఎం జగన్ గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమం కొనసాగాలంటే వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు జగన్.
ఏపీ సీఎం జగన్ గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమం కొనసాగాలంటే వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు జగన్.
చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ ముగిసింది. సీట్ల మార్పుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనపర్తి, ఉండి స్థానాలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనపర్తి టీడీపీకి ఇవ్వాల్సి వస్తే.. ఓ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
AP: లోకేష్‌కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్ పంపింది. లోకేష్ ఫోన్‌కు ట్యాపింగ్, హ్యాకింగ్ ప్రయత్నం జరుగుతుందని ఈ మెయిల్ పంపింది. ట్యాపింగ్, హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. లోకేష్ ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వమే అని ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు.
బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్న ఓ టీచర్ విద్యార్థి రాసిన జవాబును చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ సమాధానం ఏంటంటే.. ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని ఉండటం చూసి..టీచర్ అవాక్కయ్యారు.
పవన్‌కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్‌కు నోటీసులు ఇచ్చింది ఈసీ.
అధిక విద్యుత్ ఛార్జీలకు నిరసనగా టీడీపీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. కరెంట్ బిల్లులను సోషల్ మీడియాలో షేర్ చేయాలని లోకేష్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. #NakuShockkottindhi హ్యాష్‌ట్యాగ్‌తో బిల్లులు షేర్ చేయాలని అన్నారు
పవన్‌తో భేటీ అయ్యారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీనా, లోక్ సభనా అనేది తేలాల్సి ఉందని అన్నారు. మరో 48 గంటల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే దానిపై క్లారిటీ రానున్నట్లు చెప్పారు.
అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది భారత చైతన్య యువజన పార్టీ. 32 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. ఈ క్రమంలో పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి బిగ్ బాస్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రిని పోటీలోకి దింపారు.
మంగళగిరిలో లోకేష్‌కు షాక్ ఇచ్చారు వాలంటీర్లు. తాడేపల్లి మండలం పెనుమాకలో 50 మంది.. మంగళగిరి మండలంలో 47మంది వాలంటీర్ల రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను అధికారులకు అందించారు. జగన్ మళ్లీ సీఎం అయ్యాక తమను ఉద్యోగాల్లో తీసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.